Ponnam Prabhakar ( IMAGE CREDIT: SWTCHA REPORTER)
తెలంగాణ

Ponnam Prabhakar: తెలంగాణలో రవాణాశాఖ చెక్కు పోస్టులు రద్దు చేశాం.. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం

Ponnam Prabhakar: నిర్బయ స్కీం కింద వెహికిల్ ట్రాకింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్స్ప (Ponnam Prabhakar)ష్టం చేశారు. తెలంగాణలో రవాణాశాఖ చెక్కు పోస్టులు రద్దు చేశామని, నుంచి అమలు చేస్తూ జీవో 58 జారీ చేశామన్నారు. చెక్కు పోస్టుల రద్దు చేస్తూ ప్రజల్లో అవగాహన కలిగించడానికి , ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ లో జరగడానికి చెక్కు పోస్టులను రద్దు చేస్తూ రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకున్నామన్నారు. చెక్కు పోస్టులు పూర్తిగా మూసివేస్తూ అమలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ ను ఉపయోగించి రవాణా శాఖ కార్యాలయాల్లో రికార్డ్ చేస్తూ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళని నోట్ చేసి హెడ్ ఆఫీస్ కి అలెర్ట్ చేస్తుంది..అలాంటి వాటిని నిరోధించడానికి ఉపయోగిస్తున్నామన్నారు. బ్రోకర్ (మధ్యవర్తులు)వ్యవస్థను అరికట్టడానికి కఠినచర్యలు తీసుకుంటున్నామన్నారు. రవాణా శాఖ లోని 63 కేంద్రాల్లో కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని వెల్లడించారు.

Also ReadMinister Ponnam Prabhakar: నియోజకవర్గాల వారీగా కొత్త రేషన్ కార్డుల జారీ

 వెహికిల్ అమ్మకాల షేర్ 0.03 నుంచి 1.30కి షేర్ పెరిగింది 

తెలంగాణ లో ఈవీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత రూ.577 కోట్ల టాక్స్ ప్రభుత్వం మినహాయించిందని, దీంతో ఇవీ వెహికిల్ అమ్మకాల షేర్ 0.03 నుంచి 1.30కి షేర్ పెరిగిందన్నారు. పొల్యూషన్ పెరగకుండదనే ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు. నగరంలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటో లకు అనుమతి ఇచ్చామని, ఎల్పీజీ, సీఎన్జీ ఆటో లకు 10 వేలు చొప్పున, 25వేలు రేటిరోఫిటింగ్ ఆటో లకు అనుమతి ఇచ్చామన్నారు. రాష్ట్రంలో వాహన్ అమలవుతుందని, సారథి త్వరలోనే తీసుకొస్తామన్నారు. స్క్రాపింగ్ పాలసీ తీసుకొచ్చామని, వాహనాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేడియం స్టిక్కర్స్ అమలయ్యేలా తెచ్చామన్నారు.

హై సెక్యూరిటీ ప్లేట్స్ తీసుకొస్తున్నాం

రోడ్డు సెప్టీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. రోడ్ సేఫ్టీ చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ లు ఏర్పాటు చేస్తున్నామని, నాచారం, కరీంనగర్ లో ప్రారంభించుకున్నామన్నారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకొస్తున్నామన్నారు. టూరిజం వెహికల్స్ కి డబుల్ నెంబర్ ప్లేట్ తో పోతున్నాయని ఆరోపణల నేపథ్యంలో హై సెక్యూరిటీ ప్లేట్స్ తీసుకొస్తున్నామని వెల్లడించారు. రోడ్ సేఫ్టీ క్లబ్స్ కాలేజీలలో జూనియర్, డిగ్రీ ఇతర వాటిలో అవగాహన కల్పించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం క్యాష్ లెస్ ట్రీట్మెంట్ 1.50 లక్షల వరకు వర్తింపజేస్తుందన్నారు. దాని అమలు పై మెడికల్ , పోలీస్, నేషనల్ హైవేస్ తో సమీక్షా సమావేశం నిర్వహించామని వెల్లడించారు.

ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి 

రవాణాశాఖను బలోపేతం చేస్తున్నామని, 112 మంది ఏఎంవీఏలను నియమించి వారికి శిక్షణ ఇచ్చి తీసుకున్నామన్నారు. 10మంది జూనియర్ అసిస్టెంట్లు, నలుగురు ఆర్టీవో లను గ్రూప్ 1 ద్వారా వచ్చారన్నారు. ప్రమోషన్స్ కల్పిస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని కోరారు. ఇల్లీగల్ , ఓవర్ లోడింగ్ పై ఎన్ఫోర్స్ మెంట్ బృందం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో1.7 కోట్ల వాహనాలు ఉన్నాయని వాటన్నిటిని రోడ్ ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాత వాహనాలు డబుల్ నంబరింగ్ అరికట్టడానికి మైనింగ్, మినరల్ వాటర్ ఇతర వాహనాలకు తొలుత చేపడుతున్నామన్నారు.

పాత వాహనాలకు స్క్రాప్ కి పంపించాలి

చెక్ పోస్ట్‌ల మాటున గత పదేళ్లలో పాపాల పుట్టలా అవినీతి జరిగిందన్నారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వాహన్ సారధిలో చేరలేదని, ‘ఇప్పుడు మేము వాహన్, సారథిలో చేరాం. డేటా ట్రాన్స్‌ఫార్మింగ్ జరుగుతోందని వెల్లడించారు. పోలీస్ శాఖ ,ఆర్టీసీ ఇతర విభాగాలలో పాత వాహనాలకు స్క్రాప్ కి పంపించాలని లేఖ రాశామన్నారు. శాఖకు వచ్చే ఆదాయాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనదారులు ఆర్సీ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ రాకపోతే నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షోరూంలల్లో వాహన రిజరిస్ట్రేషన్ల అంశాన్ని ఆలోచన చేస్తున్నామని తెలిపారు.

Also Read: Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం.. మంత్రి పొన్నం

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?