KTR (imagecredit:Twitter)
తెలంగాణ

KTR: ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్

KTR: ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడైనా రాష్ట్ర ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రుజువు చేశారు. కృత్రిమ మేధస్సులో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ అయిన ఓపెన్‌ఏఐ(Open AI) సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌(Sam Altman)కు హైదరాబాద్‌(Hyderabad)ను ఆహ్వానించి, ఆయన ప్రదర్శించిన రాజనీతిజ్ఞతకు దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓపెన్‌ఏఐ తమ మొదటి కార్యాలయాన్నిదేశంలో ప్రారంభించనున్నట్లు సామ్ ఆల్ట్‌మన్ ఎక్స్(X) లో పోస్ట్ చేయగా, కేటీఆర్ వెంటనే స్పందించారు. ఓపెన్‌ఏఐ కార్యాలయానికి హైదరాబాద్ అన్ని విధాలుగా అనువైన గమ్యస్థానమని పేర్కొన్నారు.

తెలంగాణలో గత ప్రభుత్వాలు

సాంకేతిక నిపుణుల లభ్యతతో పాటు, ఇక్కడ ఉన్న టీహబ్(T-Hub), వీహబ్(V-Hub), టీవర్క్స్(T-Work), తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ వంటి వ్యవస్థలను ఆయన ఉదాహరించారు. అలాగే, మైక్రోసాఫ్ట్(Microsoft, గూగుల్(Google), అమెజాన్(Amezen), మెటా(Meta), యాపిల్(Apple) వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలకు హైదరాబాద్ ఎలా నిలయంగా మారిందో వివరించారు. తెలంగాణలో గత ప్రభుత్వాలు కృత్రిమ మేధస్సుకు ఎంతగా ప్రాధాన్యతనిచ్చాయో, 2020ని ‘ఏఐ సంవత్సరంగా’ ప్రకటించి, అనేక కార్యక్రమాలను చేపట్టాయని గుర్తు చేశారు. కేటీఆర్ నిష్పక్షపాత, తెలంగాణ ఫస్ట్ విధానాన్ని నెటిజన్లు ప్రశంసించారు. రాజకీయాలకతీతంగా ఆయన వ్యవహరించిన తీరుపై వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి.

Also Read: Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటరు జాబితా సవరణకు సిద్ధం!

విభేదాలను పక్కనపెట్టి

ఎక్స్ యూజర్ యోగేశ్ శర్మ(Yogesh Sharma) స్పందిస్తూ, “అన్ని విభేదాలను పక్కనపెట్టి, ఒక ప్రతిపక్ష నాయకుడు తన రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాడు” అని ప్రశంసించారు. అవంతిక లోహర్ అనే నెటిజన్, “యూపీ మంత్రుల నుంచి మేము కోరుకునేది ఇదే. యోగి ఆదిత్యనాథ్ దీన్ని గమనించండి” అని వ్యాఖ్యానించారు. ఇండియన్ ట్రెండ్ ఎక్స్ అనే యూజర్, “ఖచ్చితంగా చెప్పారు. భారతదేశంలో ఓపెన్‌ఏఐ కార్యాలయానికి హైదరాబాద్ సరైన ప్రదేశం” అని పేర్కొన్నారు. ‘భారతీయనెవేషక్’ అనే యూజర్ స్పందిస్తూ, “ఈ వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన సందేశాన్ని చూడండి.

ప్రతిపక్షంలో ఉండి కూడా

అధికారంలో ఉన్నా, లేకున్నా మీ సొంత రాష్ట్రంలోని నాయకులతో దీన్ని పోల్చుకోండి. పార్టీలకు అతీతంగా ఉన్న సోకాల్డ్ జాతీయ నాయకులతో పోల్చుకోండి” అని పోస్ట్ చేశారు. నిరంకుష్ దాస్ అనే నెటిజన్, “ప్రతిపక్ష నాయకుడు తన రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ప్రయత్నించడం ఇంతకుముందు బహుశా ఎప్పుడూ జరగలేదు” అని అభిప్రాయపడ్డారు. విక్రమ్ మోహన్ స్పందిస్తూ, “వావ్! ప్రతిపక్షంలో ఉండి కూడా నగరం కోసం ప్రచారం చేస్తున్నారు. హ్యాట్సాఫ్” అని అభినందించారు. టి శ్రీకాంత్ అనే మరో నెటిజన్, “నిజమైన నాయకత్వం అంటే ఏమిటో మాకు చూపించినందుకు ధన్యవాదాలు. రాష్ట్రానికి ఎవరు నాయకత్వం వహించినా, రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ప్రయోజనాలను కాపాడాలి. స్థిరమైన పాలనకు తెలంగాణ ఒక ఉదాహరణగా నిలవాలి” అని అన్నారు. కేటీఆర్ ఆలోచనలు పార్టీ రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని నెటిజన్లు కొనియాడారు. ఆయన చూపుతున్న సమతుల్య, దూరదృష్టి గల నాయకత్వం భారతదేశపు కృత్రిమ మేధస్సు విప్లవంలో ఒక ఆశావాహ దృక్పథాన్ని నింపింది.

Also Read: Farmers Protest: రైతులను వేధిస్తున్న యూరియా కొరత.. కారేపల్లిలో రోడ్డెక్కిన అన్నదాతలు

Just In

01

Warangal Montha Cyclone: ఓరుగల్లును ముంచిన మొంథా తుఫాన్.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం!

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన రేట్స్?

Montha Cyclone: నిండా ముంచిన మొంథా.. ఐకేపీ కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు