Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఓటరు జాబితాను సవరణ చేయనున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy) పేర్కొన్నారు. తెలంగాణలోని జూబ్లీహిల్స్(Jubilee Hills )అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నిక దృష్ట్యా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధుల చట్టం, 1950 (ధరా 21) ప్రకారం నిర్వహించే ఈ సవరణకు 2025 జూలై 1ను అర్హత తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు.
Also Read: Komatireddy venkat reddy: లక్షల కోట్లు అవినీతి చేసిన వాళ్లు నీతులు చెప్తారా?.. మంత్రి ఫైర్?
ఫామ్ 7, సవరణల కోసం ఫామ్ 8
ఆ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పౌరులు, అలాగే గతంలో నమోదు చేయని వారు తమ పేర్లను చేర్చుకోవడానికి అభ్యంతరాలు, సవరణలు చేయడానికి దరఖాస్తులు సమర్పించవచ్చని స్పష్టం చేశారు. నమోదు కోసం ఫామ్ 6, అభ్యంతరాల కోసం ఫామ్ 7, సవరణల కోసం ఫామ్ 8 వినియోగించాలన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో కూడా https://voters.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చన్నారు. వాటిని పరిశీలించిన తర్వాత తుది జాబితా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం ప్రచురించబడుతుందని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: Jubilee Hills By Election: ఉప ఎన్నికను టాస్క్‌గా తీసుకున్న సర్కార్.. సీక్రెట్ అదేనా?