Farmers Protest: యూరియా కొరతతో కారేపల్లి మండలంలో అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఉదయం 4 గంటలకే సొసైటీ ఆఫీస్ కు వచ్చి గంటల తరబడి క్యూలో నిలుచున్నా ఒక్కొక్క కట్ట మాత్రమే ఇవ్వడంతో రైతులు(Farmers) రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఆ ఒక్క కట్ట కూడా సగం మందికి అంది మిగతా వారికి అందకపోవడంతో ఆగ్రహానికి గురైన అన్నదాతలు కారేపల్లి ఇల్లందు రోడ్డు(Road)పై బైఠాయించి గంటపాటు రాస్తారోకో చేశారు. మండల వ్యవసాయ అధికారి, పోలీసు అధికారులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప చేశారు. యూరియా వస్తుంది ఇస్తామని చెప్పుకుంటూనే యూరియా కొరత లేదని మండల వ్యవసాయ అధికారి పేర్కొనడం ఆశ్చర్యంగా ఉంది. రైతులకు సమాధానం చెప్పడంలో వారికి నచ్చ చెప్పడంలో వ్యవసాయ శాఖ అధికారులు మాట జారటం వల్లనే రైతులు(Farmers) ఆగ్రహానికి గురై రోడ్ ఎక్కి ఆందోళన చేయాల్సి వచ్చిందని పలువురు రైతులు(Farmers) వాపోయారు.
Also Read: Urea Shortage: తొర్రూరులో యూరియా కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు
అవసరానికి సరిపడా ఇవ్వలేకపోతున్నారు…
కారేపల్లి మండలంలో 41 గ్రామపంచాయతీలు ఉండగా 22 వేల ఎకరాల్లో రైతులు(Farmers) పత్తి సాగు చేశారు. 5500 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 110 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేశారు. ఈ పంటలు సాగుచేసిన రైతులందరికీ యూరియా అవసరం ఉంది. కారేపల్లి మండలానికి ఇప్పటివరకు 400 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు(Farmers) మాత్రం కారేపల్లి సొసైటీ కార్యాలయం ముందు రోజు రైతులు(Farmers) క్యూలో నిలబడి పడరాని పాట్లు పడుతున్నారు.
రైతు ముస్తఫా…
ఎనిమిది ఎకరాల పత్తి, రెండు ఎకరాలు వరి సాగు చేస్తున్నా యూరియా అందక ఇబ్బంది పడుతున్నాం రైతు గంటల తరబడి క్యూలో ఉన్నా యూరియా అంధక ఇబ్బంది పడుతున్నాం. పంటకి అదునులో యూరియా(Urea) వేయకపోతే దిగుబడిపై ప్రభావం పడుతుంది. ప్రభుత్వం రైతుల(Farmers) కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ఉంది.
Also Read: Jogulamba Gadwal: రైతులను వెంటాడుతున్న యూరియ కష్టాలు