Tummala Nageswara Rao: దేశ చరిత్రలోనే సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానాన్ని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ లతో కలిసి నియోజకవర్గంలోని సత్తుపల్లి-వేంసూర్ మండలం లింగపాలెం హైవే ఎగ్జిట్ నుండి కల్లూరు మండలం లింగాల హైవే ఎగ్జిట్ వరకు నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… దేశ చరిత్రలోనే సత్తుపల్లి నియోజకవర్గంలో హైవే రోడ్డుపై మూడు ఎగ్జిట్ రహదారులను ఇవ్వడం ఇదే ప్రధమమని, ఆ ఘనత సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే రాగమయి, నియోజకవర్గ ప్రజలకు దక్కుతుందన్నారు. రైతుల కోసం అన్ని ప్రాంతాల్లో ఎగ్జిట్ రహదారులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జూలై రెండో తారీకు కల్లా హైవే రోడ్డు పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Also Read: Black Jaggery: యథేచ్ఛగా నల్ల బెల్లం దందా.. సహకరిస్తున్నఎక్సైజ్ అధికారులు?
సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ… నియోజకవర్గంలో హైవేపై మూడు ఎగ్జిట్ లు ఇచ్చినందుకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రుణపడి ఉంటానన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రావి నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, సత్తుపల్లి, కల్లూరు ఏఎంసి చైర్మన్లు దోమ ఆనంద్, భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, వైస్ చైర్మన్లు, నియోజకవర్గ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళ, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు