TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనంలో పాల్గొనాలంటూ ఆహ్వానం
కొత్తగూడెం, స్వేచ్ఛ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రపంచ సాహిత్య వేదిక నవంబర్ 30 (ఆదివారం) అంతర్జాలంలో 13 గంటలపాటు ప్రతిష్టాత్మక బాలసాహిత్య భేరి పేరుతో ‘అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనం’ నిర్వహిస్తుంది. ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొనాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నవభారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని బి.సుగంధిని (తండ్రి బి.విజయ ప్రకాశ్) ఆహ్వానించింది.
Read Also- Saree Colour Politics: అప్పుడు షర్మిల.. ఇప్పుడు కవిత.. చీర చుట్టూ ఈ రాజకీయమేంటో!
కథ, వచన కవిత్వం, గేయం, పద్యం విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థిని, విద్యార్థులు 101 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపింది. సుగంధిని కథ విభాగంలో ఎంపికైందని, 3 నిమిషాల పాటు కథ వినిపిస్తుందని పాఠశాల కరస్పాండెంట్ సంతోష్, ప్రిన్సిపల్ ఎన్‌వీకే ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్లు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, ప్రఖ్యాత బాల సాహితీవేత్తలు, జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రస్తావించారు.
అంతర్జాతీయ కార్యక్రమంలో తమ పాఠశాల విద్యార్థినికి అరుదైన అవకాశం కల్పించిన తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.
Read Also- RTA Corruption: జనగాం ఆర్‌టీఏలో జోరుగా అక్రమ దందా.. అధికారుల పర్యవేక్షణ శూన్యం
