Ration Rice Scam (imagecredit:twitter)
ఖమ్మం

Ration Rice Scam: రేతిరయ్యిందంటే రేషన్‌కు రెక్కలే.. యదేచ్చగా రేషన్ బియ్యం దందా..!

Ration Rice Scam: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం అక్రమార్కులకు వరంగా మారింది.. సన్న బియ్యం పంపిణీతో సద్దుమణుగుతుందనుకున్న దందా మళ్లీ జడలు విప్పుతోంది.. సన్న బియ్యం నాణ్యత లేకుండా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తినేందుకంటే అమ్ముకునేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు.. దీంతో అక్రమార్కుల చీకటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఏ ప్రభుత్వం ఉన్నా ఈ బియ్యం అక్రమ రవాణాలో పాత్రదారులు మారడంలేదు. మండలాలు, నియోజకవర్గాలుగా పంచుకున్న అక్రమార్కులు అధికార్లకు, నాయకులకు సెటిల్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆగని రేషన్ బియ్యం దందా..!

ఖమ్మం(Khammam) జిల్లా లో రేషన్ బియ్యం దందా మళ్లీ జోరందుకుంది. పేదల ఇళ్లకు చేరాల్చిన ప్రభుత్వ బియ్యం రాత్రి వేళల్లో మిల్లులు, గోదాములకు చేరిపోతున్నాయి. అక్కడ నుంచి మార్కెట్ లోకి మళ్లీ ప్రైవేట్ బాయ్యంగా మారిపోతున్నాయి. ఈ దందా వెనుక డీలర్లు, మిల్లర్లు, అధికారుల పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో రేషన్ బియ్యం పంపిణీ పూర్తయిన తర్వాత మిగిలిన బియ్యం, ప్రజల వద్ద నుంచి గుట్టుచప్పుడు కాకుండా తీసుకున్న బియ్యాన్ని ఎవరికీ అనుమానం రాకుండా మిల్లులకు తరిలిపోతున్నాయి. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలించడం లో డిలర్లు సిద్ధహస్తులుగా పేరుగాంచారు.

జిల్లాను పంచుకున్న అక్రమార్కులు

రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులు జిల్లాను ఏరియాలు, మండలాలుగా పంచుకొని అక్రమ వ్యాపారం గుట్ట చప్పుడు సాగిస్తున్నారు. ఒకరి ఏరియాలోకి మరొక వ్యాపారి పొకండా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: RRB Recruitment: RRB జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2025

సన్న బియ్యం రీసైక్లిగ్..

మిల్లులకు చేరిన రేషన్ బియ్యం రీసైక్లిగ్ చేసి మళ్లీ సన్న బియ్యం పేరుతో రకరకాల బ్రాండ్ ల పేరుతో ప్యాకేజింగ్ చేసి మార్కెట్లోకి వస్తున్నాయి. రీసైక్లిగ్ చేసిన బియ్యాన్ని ఎవరూ గుర్తుపట్టలేని విధంగా ఉంటాయి. పేదలకు ఒక్క రూపాయి కి అందాల్సిన బియ్యం మార్కెట్ లో రూ 40 వరకు అమ్ముడుపోతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం తో మిల్లర్లు, డీలర్లు నెలకు లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నారు. జిల్లాలో పదుల సంఖ్యలో మిల్లులు ఈ దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారుల పాత్ర పై అనుమానం

ఈ దందా వెనుక అధికారుల పాత్ర లేకుండా జరగం అసాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేషన్ బియ్యం మిల్లులకు చేరడం అక్కడ నుంచి మార్కెట్ లోకి తిరిగి రావడం వెనుక పెద్ద నెట్ వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా ముడుపులు అందుకుంటున్నందునే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం పేదలకు చౌక ధరలో నాణ్యమైన బియ్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ ఇలాంటి కేటుగాళ్ల వల్ల ప్రభుత్వానికి అపకీర్తి మూటకట్టుకుంది. అదే కాకుండా పేద కుటుంబాలు బయట మార్కెట్ లో ఎక్కువ రేటుకు బియ్యం కొనాల్చి వస్తుంది. ఇప్పటికే సంబందిత శాఖా అధికారులు స్పందించి రేషన్ బియ్యం అక్రమ రవాణా కు అడ్డు కట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

Also Eead: Chalo Bus Bhavan: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద హైటెన్షన్.. బస్ భవన్‌లోకి కేటీఆర్, హరీశ్‌కు నో ఎంట్రీ.. పలువురు అరెస్ట్

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..