Khammam District: ఆ ఊరు నుంచి ఇసుక ట్రాక్టర్ (Sand Tractor) వెళితే చాలు ఆ ఆ గ్రామంలో కొంతమంది ట్రాక్టర్లకు అడ్డుపడుతూ రూ. 200 కట్టాల్సిందేనని ఖరాఖండిగా ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు సంబంధిత అధికారుల నుండి అనుమతి పత్రాలు పొంది అందుకు చాలాన్లు సైతం కట్టి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. గతంలో వసూలు చేసిన గ్రామస్తులు కొన్ని అనివార్య కారణాలవల్ల కొంతమంది అధికారులు ప్రశ్నించడంతో వసూళ్లను నిలిపివేశారు. తాజాగా మళ్లీ గ్రామంలో కొంతమంది పైసల్ వసూలు చేయడం మొదలుపెట్టారు.
Also Read: Khammam district: ఖమ్మం జిల్లా గంగారంతండాలో.. యువ శాస్త్రవేత్త అశ్విని గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు
పైసలు కడితేనే ట్రాక్టర్లు వెళ్లాలి
దేవుడి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆ కొద్ది మంది ఎవరని గ్రామస్తులు చర్చించుకోవడం గమనార్హం. గ్రామస్తులయితే గ్రామంలో చర్చించుకోవాల్సిన అవసరం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో దేవుడి పేరుతోనో లేదంటే మరో అభివృద్ధి పేరుతోనో వసూలు చేస్తే గ్రామస్తులందరికీ తెలిసిపోతుంది. మరి ఆ కొద్దిమంది మాత్రమే వసూలు దందాకు ఎందుకు పాల్పడుతున్నారు అనేది ప్రశ్న. వివరాల్లోకి వెళ్తే ముదిగొండ మండలం పెద్ద మండవలో పైసలు కడితేనే ట్రాక్టర్లు వెళ్లాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్ యజమానుల నుండి ఒక్కొక్క ట్రిప్ కు రూ. 200 చొప్పున వసూలు చేసి అక్రమ దందాకు తెర లేపుతున్నారు. పేదోడి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఇసుక ట్రాక్టర్ల యజమానులు ప్రభుత్వ అధికారుల నుండి అనుమతి నిరుపేదలకు ఇసుకను సరఫరా చేస్తున్నారు.
అధికారులు గతంలో హెచ్చరించిన
ముదిగొండ (Mudigonda) మండలం (Khammam District) పెద్ద మండవ గ్రామంలో అకారణంగా ఇసుక ట్రాక్టర్ల యజమానుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న గ్రామస్తులకు అధికారులు గతంలో హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కొంతకాలం అక్రమ వసూళ్లకు బ్రేక్ వేసిన గ్రామస్తులు తాజాగా కొంతమంది అక్రమార్కులు ఇసుక ట్రాక్టర్ల వద్ద నుంచి అక్రమంగా ఒక్కో ట్రాక్టర్కు 200 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ట్రాక్టర్ యజమానులను బెంబేలితిస్తున్నారు. అక్కడి నుంచి ఇసుకను సరఫరా చేయాలంటే భయపడిపోతున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే సమాధానం లేకుండా డబ్బులు ఇస్తేనే కదలాలి లేదంటే ఇక నుంచి వెళ్లొద్దు అంటూ వార్నింగ్ ఇస్తూ ట్రాక్టర్ నిర్వహకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
అక్రమ వసూల్ దందాతో నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి బ్రేక్
పెద్దమండవ గ్రామంలో కొద్దిమంది అక్రమార్కులు ఇసుక ట్రాక్టర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుండడంతో ట్రాక్టర్ నిర్వహకులు ఇసుకను తోలడానికి నిరాకరిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను సాంక్షన్ చేసి నిర్మాణాలు చేసుకోవాల్సిందిగా సూచించింది. నిర్మాణాలు చేయాలంటే ప్రథమంగా కావాల్సింది ఇసుక కాబట్టి ఆ ఇసుక లేకపోవడం వల్ల నిరుపేదలు ఇండ్లు నిర్మించుకునేందుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో అటు ట్రాక్టర్ నిర్వహకులు ఇటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ దారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
వసూళ్ల వెనుక రాజకీయ హస్తం
పెద్దమండవ గ్రామంలో అక్రమంగా వసూలు చేస్తున్న కొద్ది మంది వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. రాజకీయ నాయకుల అండదండలతోనే కొద్ది మంది ఇసుక ట్రాక్టర్ల రవాణా వ్యవస్థ పై కన్నేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రణాళిక చేసినట్లుగా ఆ గ్రామంలో చర్చ జరుగుతుంది. ఇసుక ట్రాక్టర్లు గ్రామం పై నుండి రవాణా చేస్తే దుమ్ము దూళి వస్తుంది. అది నిజమే అయినప్పటికీ దానికి తాత్కాలిక మార్గం చూడాలి తప్ప కానీ అక్రమ వసూళ్ల దందాల పర్వం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అటు ఇసుక ట్రాక్టర్ల నిర్వాహకులు ఇటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ అక్రమ వసూళ్లపై నేరుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కు ఫిర్యాదు చేసేందుకు ఇసుక ట్రాక్టర్ల నిర్వాహకులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Crime News: వివాహేతర సంబంధం అనుమానంతో.. భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త.. ఎక్కడంటే?
