ST SC Chairman Bakki Venkataiah (imagcredit:swetcha)
కరీంనగర్

ST SC Chairman Bakki Venkataiah: పోడు భూముల పట్టాలు 10 రోజుల్లో పరిష్కరించండి.. లేదంటే!

కరీంనగర్‌ స్వేచ్ఛః ST SC Chairman Bakki Venkataiah: జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి గితే, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కుశ్రము నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ , సభ్యులు ఉదయం మేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. సమీక్ష సమావేశంలో వెంకటయ్య మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో 4 వేల 313 ఎకరాలకు సంబంధించి 6,029 మంది రైతులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా 1,614 మంది రైతులకు 2,860 ఎకరాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పెండింగ్ ఆర్.ఓ.ఎఫ్.ఆర్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఎస్టీ రైతులందరికీ పట్టాలు అందాలని 10 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్, రోడ్డు భవనాలు, ముఖ్య ప్రణాళిక అధికారి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో నిధులు పక్క దారి పట్ట వద్దని , ఎక్కడైనా నిధులు దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. సబ్సిడీ కింద ప్రభుత్వం మంజూరు చేసే మొత్తం సద్వినియోగం జరిగి యూనిట్లకు గ్రౌండ్ అయ్యే విధంగా ప్రత్యేక చోరవ చూపాలని అన్నారు. సీ.ఎం.ఓ. కార్యాలయంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు బాగా పనిచేస్తున్నారని మంచి పేరు ఉందని, ఆపేరు కాపాడుకోవాలని అన్నారు.

Also Read: Friendly Traffic Police: బైక్ ఆపిన పోలీస్.. ఒట్టేసి మరీ చెప్పిన బైకర్.. వీడియో వైరల్..

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఎటువంటి మరణాలు లేకుండా మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్య బృందానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అభినందనలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకుంటున్నారని ఆయన అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పై 233 ఫిర్యాదులు రాగా 233 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేశామని, 136 చార్జి షిట్ దాఖలు చేయడం జరిగిందని అన్నారు.

జిల్లాలో పెండింగ్ ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కోర్టులలో పెండింగ్ ఉన్న కేసులు శిక్ష వచ్చేలా సాక్ష్యాలను ప్రవేశ పెట్టాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో ఎఫ్.ఐ.ఆర్ నమోదైన కేసులో 116 మందికి, చార్జి షిట్ దశలో 57 మందికి మొత్తం కోటి 28 లక్షల 87 వేల 500 రూపాయల పరిహారం చెల్లించడం జరిగిందని, మిగిలిన 194 బాధితులకు చెల్లించాల్సిన కోటి 45 లక్షల 30 వేల రూపాయలు త్వరగా మంజూరు చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..