Indiramma Housing scheme (imagecredit:swetcha)
కరీంనగర్

Indiramma Housing scheme: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరందుకున్న ఇందిరమ్మ ఇళ్ల స్పీడప్‌!

కరీంనగర్‌ బ్యూరో స్వేచ్ఛః Indiramma Housing scheme: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింది ఎంపికైన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక కార్యచరణ తీసుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి సర్వం సిద్దం చేసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి పొరపాట్లు జరుగకుండ వచ్చిన దరఖాస్తులలో అత్యంత నిరుపేదలకు మాత్రమే మొదటి విడతలో ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాలకు కలిపి మొదటి విడతలో 7000 ఇళ్లను ప్రభుత్వం మంజూరి చేసింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం మంజూరు చేసిన 3,500 ఇండ్లలో పైలెట్ ప్రాజెక్టు కింద మండలాలో ఎంపిక చేసిన గ్రామాలలో ఇళ్లు మంజూరు చేశారు. మిగిలిన ఇండ్లను గ్రామాలు, మున్సిపల్ వార్డుల వారీగా మంజూరు చేసేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అర్హత ఉండి ఇంటి స్థలం ఉన్న దరఖాస్తుల సంఖ్య ప్రాతిపదికగా సదరు గ్రామాలకు, వార్డులకు ఇళ్ల కేటాయింపు ఏప్రిల్ 17 లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

Alao Read: MLA Gaddam Vivek: గత పాలకుల నిర్లక్ష్యం.. నేటికి మోక్షం.. ఎమ్మెల్యే గడ్డం వివేక్

గ్రామాలు, వార్డులలో ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి, అర్హుల జాబితాలో నుంచి మొదటి విడత మంజూరు చేసేందుకు గ్రామానికి కేటాయించిన ఇళ్ల సంఖ్యకు తగ్గటుగా లబ్ధిదారుల ఎంపిక చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. ఏప్రిల్ 21 లోపు ఇందిరమ్మ కమిటీల నుంచి ప్రతి గ్రామ, వార్డుకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల జాబితా వివరాలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఎక్కడైన ఇందిరమ్మ కమిటీలు కొన్ని గ్రామాలలో ఏర్పాటు కాకుంటే స్థానిక ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు.

200లకు ప్రత్యేక అధికారి..

ఇందిరమ్మ కమిటీ ఆమోదించిన ప్రతి 200 ఇండ్ల లబ్ధిదారులకు ప్రత్యేక అధికారి, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి బృందంగా ఏర్పడి ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 30 వరకు మరో సారి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తారు. ఎవరైనా అనర్హులు ఉంటే జాబితా నుంచి తొలగించి 2మే వరకు ప్రతి గ్రామంలో అర్హుల జాబితాను ప్రకటించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా ఇంఛార్జి మంత్రి తుది ఆమోదంతో మే 5 తరువాత ఇందిరమ్మ ఇండ్లు మంజూరి పత్రాలు పంపిణీ మండల కేంద్రాలకు పంపించడానికి ఏర్పాట్లు చేశారు.

నాలుగు విడుతల్లో సాయం..  

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారులకు నాలుగు దశలలో సహాయం అందించడానికి ఏర్పాట్లు చేశారు. బేస్మెంట్ పూర్తయితే 1లక్ష రూపాయలు, లెంటల్ లెవెల్ పూర్తయితే రూ. లక్ష , స్లాబ్ నిర్మాణం జరిగినప్పుడు రూ. 2 లక్షలు, ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత రూ. 1 లక్ష చొప్పున మొత్తం రూ. 5 లక్షల రూపాయల ప్రభుత్వం నుంచి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.

జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాలలో 1023 ఇండ్లు మంజూరు చేశారు. వీటిలో 282 ఇండ్లు ఇప్పటి వరకు మార్క్ చేశారు. పెండింగ్ లబ్దిదారులతో చర్చించి ఇండ్ల నిర్మాణం త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌ కార్యచరణ అమలు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూన్‌, జూలై మాసంలో పేదల సోంతింటి కల నేరవేరనుంది.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు