Hca ( Image Source: Twitter )
తెలంగాణ, హైదరాబాద్

Hyderabad Cricket Association: హెచ్​సీఏ సెలెక్షన్​ కమిటీ సభ్యులపై కేసులు

Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్​ అసోసియేషన్​ (హెచ్​సీఏ)లో రోజుకో అవినీతి బాగోతం వెలుగు చూస్తోంది. తాజాగా వర్ధమాన క్రికెట్ ఆటగాళ్ల నుంచి డబ్బు డిమాండ్ చేశారంటూ ఉప్పల్​ పోలీసులకు ఇద్దరు ప్లేయర్ల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సెలెక్షన్​ కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వర్ధమాన క్రికెటర్ల ప్రతిభను వెలికి తీయటానికి హెచ్​సీఏ ఆధ్వర్యంలో అండర్ 19, అండర్​ 23 లీగ్ మ్యాచులు జరిగే విషయం తెలిసిందే.

అయితే, ఈ మ్యాచుల్లో ఆటగాళ్లను ఆడించాలంటే తమకు డబ్బు చెల్లించాల్సిందే అంటూ సెలెక్షన్​ కమిటీ ఛైర్మన్ హబీబ్ అహమద్ తోపాటు సందీప్ రాజన్​, సందీప్ త్యాగిలు డబ్బులు డిమాండ్​ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని మంచి ప్రదర్శన చేసినా తమ పిల్లలను లీగ్ మ్యాచుల్లో ఆడనివ్వలేదంటూ కోట రామారావు అనే వ్యక్తి బుధవారం ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చారు. ఈ మేరకు హబీబ్ అహమద్, సందీప్ రాజన్​, సందీప్ త్యాగిపై బీఎన్ఎస్​ యాక్ట్ సెక్షన్​ 318(4), 318(2), 316(5) రెడ్​ విత్ 3(5) ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Just In

01

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?