Dharna at TG Secretaria: తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. మన ఊరు–మన బడి కార్యక్రమం బిల్లులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మూడేళ్లుగా సుమారు రూ.369 కోట్లు పెండింగ్ ఉన్నాయని, అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా తమ గోడు ఎవరూ వినడం లేదని, అందుకే ఆందోళనకు దిగామని కాంట్రాక్టర్లు తెలిపారు.
సెక్యూరిటీ స్టాఫ్ షాక్
అయితే, ఏకంగా డిప్యూటీ సీఎం ఫ్లోర్‌లోనే ఆందోళనలు నిర్వహించడం గమనార్హం. కాంట్రాక్టర్ల మెరుపు ధర్నాను చూసి సెక్యూరిటీ స్టాఫ్ కూడా షాక్ అయ్యారు. చివరికి పోలీసు అధికారులు జోక్యం చేసుకొని కాంట్రాక్టర్లకు సర్ది చెప్పాల్సి వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కూడా కాంట్రాక్టర్లతో మాట్లాడినట్లు సమాచారం. గతంలో ఓ సారి ఇదే ఫ్లోర్‌లో కాంట్రాక్టర్లు ధర్నా చేయగా, తాజాగా మరోసారి నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Medak District: మెదక్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు… మునిగిపోయిన ఆలయం?