Power Cables Hyderabad (Image CREDIt: SWETCHA REPORTER)
హైదరాబాద్

Power Cables Hyderabad: ఫ్లైఓవర్ల పైనా కుప్పలుగా కేబుల్ వైర్లు.. ఇంటర్నెట్ టెలిఫోన్ వైర్లతో ప్రమాదాలు

Power Cables Hyderabad: ఒకటి రెండు కాదు దాదాపు అరడజను సర్కారు శాఖల నిర్లక్ష్యం పుణ్యమా అని నగరంలోని కరెంటు స్తంభాలు, టెలిఫోన్ స్తంభాల(Telephone poles)పై వైర్లు వేలాడుతున్నాయి. రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు, పాదచారుల పాలిట యమ పాశాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా వర్షం కురుస్తున్నపుడు స్ట్రీట్ లైట్లు(Street lights) సక్రమంగా వెలగని రోడ్లలో ఈ వైర్లు తెగి కింద పడి వాహనదారుల పాలిట ప్రాణ సంకటంగా మారాయి. నగరంలో విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేస్తున్న కేబుల్ టీవీ, ఇంటర్నెట్,(Internet) టెలిఫోన్ వైర్లు నిర్వహణ లోపం కారణంగా ప్రమాదకరంగా మారాయి. విద్యుత్ స్తంభాలపై కేవలం 4 వరుసలతో మాత్రమే కరెంటు తీగలు ఉంటే, ఆ స్తంభాలపై ఇపుడు 40 నుంచి 50 వరుసలతో కూడిన విద్యుత్, ఇంటర్నెట్, కేబుల్ వైర్లు వేలాడుతూ, అవి ఎపుడు వాహనదారులు, పాదచారులపై పడుతాయో తెలియని పరిస్తితి నెలకొంది.

కనెక్షన్ కోసం అవసరమైన పొడువు కన్నా ఎక్కువ పొడువున ఉన్న వైర్లను సైతం కట్టకట్టి స్తంభాలపైనే ఉంచేస్తున్నారు. వాస్తవానికి కూడా కేబుల్ వెర్లను ఏర్పాటు చేసేందుకు కేబుల్ సంస్థలు ప్రత్యేకంగా స్తంభాలను ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధన ఉన్నా, అది ఏ మాత్రం అమలు కాకపోవటమే ప్రమాదాలు జరిగి జనాలు ప్రాణాలు కొల్పోయేందుకు ప్రధాన కారణమవుతున్నది.

 Also Read: Khammam District: ఖమ్మం జిల్లాలో మంత్రి పీఏ ఆగడాలు.. ప్రజలు ఇబ్బందులు

పెను విషాదాలు!
టెలిఫోన్ స్తంభాలు, జీహెచ్ఎంసీ(GHMC) స్ట్రీట్ లైట్ల(Street lights) స్తంభాలంటూ తేడా లేకుండా ఒక్కో పోల్స్‌కు రకరకాల వైర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి. గాలి దుమారానికి విద్యుత్ తీగలు(Electrical wires) తగిలినప్పుడు మెరుపులు వచ్చి అవి కేబుళ్ల(Cables) మీద పడి, మంటలు వచ్చిన ప్రమాదాలు కూడా చాలానే ఉన్నాయి. గతంలో వర్షం కురిసినపుడు నాంపల్లి బస్టాపు(Nampally Bus Stop)లో కరెంట్ తీగ తెగిపడి ఏకంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా జరిగింది. ఫ్లైఓవర్లపై తెగి పడిన కేబుల్,(Cables ఇంటర్నేట్ వైర్ల పైనుంచి ప్రయాణిస్తూ వాహనదారులు స్కిడ్ అయి పడిపోయి మృతి చెందిన ఘటనలూ లేకపోలేవు. గతంలో ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న కోర్టు.. వైర్లు, ఇతర తీగలు వేలాడకుండా, రోడ్లపై పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అయినా వివిధ సర్కారు విభాగాలు తీసుకున్న చర్యలు మాత్రం అంతంత మాత్రమే. తాజాగా రామంతాపూర్ గోకుల్ నగర్Gokul Nagar)  అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనతో మరోసారి సర్కారు శాఖల నిర్లక్ష్యం బయట పడింది. కృష్ణాష్టమి రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి అక్కడ వేలాడుతున్న తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టడంతో ఐదుగురు మృతిచెందారు.

ఆ విభాగం ఏం చేస్తున్నట్లు?
కొన్నేళ్లుగా విద్యుత్ తీగల తెగి పడటం, కేబుల్ వైర్లకు విద్యుత్ తీగల తగిలి రకరకాల ప్రమాదాలు చోటుచేసుకున్నా, విద్యుత్ శాఖలో విద్యుత్ స్తంభాలు, తీగల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వింగ్ ఏం చేస్తున్నట్టో? అనే ప్రశ్న తలెత్తుతుంది. కమ్యూనికేషన్, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్స్ ఎక్కువగా స్తంభాలపై తీగలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి తీగలను ఏర్పాటు చేసిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగినా, వినియోగదారుల నుంచి ఫిర్యాదులేమైనా వస్తేనే వీటి నిర్వహణను పట్టించుకుంటున్నారే తప్పా, కనీసం వర్షాకాలానికి ముందు ఈ వైర్లకు ఇంకెంత లైఫ్ ఉంది? అన్న విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా నగరంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ప్రైవేటు సంస్థల పరిధిలోనే ఉంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్,(Internet) టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు ఎవరికీ వారుగా తమకు కంపెనీకి చెందిన 40 నుంచి 50 తీగలను విద్యుత్ స్తంభాలకు వేలాడదీస్తూ ఒకసారి ఏర్పాటు చేసి తమ పనైపోయిందని భావిస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఇష్టారాజ్యంగా కేబుళ్లు ఏర్పాటవుతున్నాయి. అక్రమంగా కేబుల్స్‌ను ఏర్పాటు చేసిన ఆ శాఖ నుంచి కనీసం ప్రశ్నించే వారే కరువయ్యారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సైతం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో కేబుళ్లు వివరీతంగా ఏర్పాటు చేస్తున్నారు.

స్తంభం ఏదైనా సరే..
వేగంగా పట్టణీకరణ చెందుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో కేబుల్, ఇంటర్నెట్,(Internet) సేవలతో పాటు విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న వైర్లు స్తంభం ఏ విభాగానికి చెందినదైనా తమ పనైపోవాలన్న చందంగా సర్వీస్ ప్రొవైటర్లు, ఇంటర్నెట్,(Internet) సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నందునే ఒక్కో స్తంభంపై వేల సంఖ్యలో వైర్లు వేలాడుతూ కన్పిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, వాటిని తొలగించి మళ్లీ ఏర్పాటు చేయటం ఒక చిక్కు సమస్యగానే మారింది. ఇంటర్నెట్,,(Internet) టీవీ ఛానళ్ల(TV channels) ఆపరేటర్లు ఇష్టం వచ్చినట్లు కేబుళ్లు వేశారు. వీధుల్లో ఏ స్తంభాన్ని చూసినా, కిలోల కొద్ది వైర్లు చుట్టి ఉంటాయి. వీటి బరువుతో స్తంభాలు కొన్ని వంగిపోవటంతో మరో రకంప్రమాదాలు పొంచి ఉన్నాయి.

స్తంభం ఏదైనా దానిపై ఏర్పాటు చేసిన కరెంట్ వైర్ కాలం చెల్లి, ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తలెత్తితే, పోల్‌పై ఉన్న కేబుళ్లన్నీ దగ్ధమవుతున్న ఘటనలు కోకొల్లలు. ఆ మంటలు సర్వసు వైర్ల నుంచి ఇంటికి, అపార్ట్మెంట్, షాపులకు విస్తరిస్తున్నాయి. మండే స్వభావం ఉన్న రసాయన పదార్థాలపై పడుతుండటంతో భారీ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఇటు వినియోగదారులే గాకా, అటు డిస్కం నష్టాల పాలవుతున్నా, ఈ రకం ప్రమదాలకు చెక్ పెట్టేందుకు ఆ శాఖ కనీస ప్రయత్నం చేయకపోవటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

 Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు