SRSP Canal: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కెనాల్ కాలువలను నిర్మించింది,కానీ ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ పునర్నిర్మాణం చేపట్టలేదు. దీంతో కాలక్రమమైన కెనాల్ కాలువలో పూడిక నిండిపోయి గండ్లుపడ్డాయి. కనీసం వాటిని మరమ్మత్తులు చేసే దిక్కు లేకపోవడంతో రైతులకు సాగునీరు అందడం లేదు, మండలంలో యాసంగి పంటలకు ఆయకట్టు రైతులకు నీరును అందించే ఎస్సార్ ఎస్పీ కెనాల్ కాలువ గండి పడి నెలలు గడుస్తున్న గండి పూడ్చక పోవడంతో రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
Also Read: Paleru Canal: వరదలకు దెబ్బతిన్న కాలువ లైనింగ్.. ఆందోళనలో రైతులు
వరుధ నీటితో కాలువ గండి
వివరాల్లోకి వెళితే..ఇనుగుర్తి మండలంలోని మీట్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని మర్రికుంట తండా సమీపంలో ఎస్సారెస్పీ 10 ఆర్1 కెనాల్ కాలువ కు ఇటీవల కురిసిన మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు వరుధ నీటితో కాలువ గండి పడింది. దింతో ఇనుగుర్తి,చిన్న నాగారం, నైనాల, రత్తిరాం తండా లకు చెందిన ఆయకట్టు కర్షకులు మొక్కజొన్న, వరి పంట, చిరుధాన్యం వంటి పంటలు వేసుకుని కాలువ నీరు కోసం ఎదురుచూస్తున్నారు.
గత మూడేళ్లుగా అదే చోట గండి
గత మూడు సంవత్సరాల నుండి కురుస్తున్న వర్షాలకు వరుసగా అదే చోట గండిపడడంతో అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యంగా కాంక్రిట్ పోయకుండా మట్టి పోసి వదిలేయడంతో అదే చోట గండిపడుతూ పంటలకు సమయానికి నీరు అందక పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరమ్మత్తులు చేపట్టి గండ్లు పూడ్చాలని , యాసంగి పంటకు సకాలంలో నీరు అందే విధంగా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించాలని పూర్తిస్థాయిలో కాలువకు మరమ్మత్తులు చేపట్టి రైతులకు సకాలంలో నీరునందించాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: DCC Posts: డీసీసీ పదవుల వారికే.. కాంగ్రెస్ అబ్జర్వర్ నారాయణస్వామి క్లారిటీ

