Paleru Canal (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Paleru Canal: వరదలకు దెబ్బతిన్న కాలువ లైనింగ్.. ఆందోళనలో రైతులు

Paleru Canal: పాలేరు రిజర్వాయర్(Paleru Canal) పరిధిలోని పాలేరు పాతకాలువలో సాగునీరు ముందుకు సాగే పరిస్థితి లేకుండా మారుతుంది. కాలువలో ఎక్కడికక్కడ చెట్లు, చెత్తా చెదారంతో దర్శనమిస్తుంది. ఈ పాలేరు పాత కాలువ(Old Canal) పరిధిలో కూసుమంచి, నేలకొండపల్లి మండలాలు ఉన్నాయి. 2017 కు ముందు పాతకాలువకు నీరు విడుదల చేస్తే కాలువకు ఎక్కడికక్కడ గండ్లు పడేవి. అప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageshwar Rao) ప్రపంచ బ్యాంకు నిధులతో పాతకాలువకు ఆధునీకీకరణ పనులకు దాదాపు రూ.70 కోట్లతో నిధులు మంజూరు చేశారు.

పాలేరు రిజర్వాయర్ దగ్గర ప్రారంభమై

ఆ నిధులతో 23 కిలోమీటర్లు పొడవు ఉన్న పాలేరు పాతకాలువను పూర్తిగా లైనింగ్ చేసి, నూతనంగా వంతెనలు నిర్మించడం, తూములకు షట్టర్లు ఏర్పాటు చేయడం పనులు చేపట్టారు. ఈ పనులను కేవలం ఆరు నెలల లోపే పూర్తి చేసి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఈ పాతకాలవ పాలేరు రిజర్వాయర్(Paleru Reservoir) దగ్గర ప్రారంభమై నేలకొండపల్లి(Nelakonda Pally) మండలంలోని బోదులబండ గ్రామం వద్ద ముగుస్తుంది. నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లోని 10 రెవిన్యూ గ్రామాల్లో 23 కిలోమీటర్ల దూరం ఈ పాత కాలువ వ్యాపించి ఉన్నది. ఈ కాల్వ పరిధిలో 32 తూములు ఏర్పాటు చేయగా, రెండు మండలాల్లో సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.

Also Read: CM Revanth Reddy: కల్వకుంట్ల ఫ్యామిలీకి వేల కోట్లు ఎక్కడివి?.. సీఎం సంచలన కామెంట్స్!

భారీ వరద కారణంగా

గత ఏడాది సెప్టెంబర్ నెలలో వచ్చిన భారీ వర్షాల(Rain) కారణంగా పాలేరు రిజర్వాయర్(Paleru Reservoir) పొంగి ప్రవహించింది. ఆ సందర్భంలో పాలేరు పాతకాలవకు కిలోమీటర్ దూరంలో భారీ వరద కారణంగా లైనింగ్ కూడా దెబ్బతిన్నది. ఈ కాలువ పరిధిలో మరికొన్ని చోట్ల కూడా లైనింగ్ కు పగుళ్లు ఏర్పడ్డాయి. పాతకాలువకు సక్రమంగా మెయింటినెన్స్ లేకపోవడంతో కాలుకట్టలపై చెట్లు పెరగడంతో పాటు, కాలువ లోపలి భాగంలో కూడా సిల్టు బాగా పేరుకుపోయింది. మరి కొద్ది రోజుల్లో అధికారులు కాలువకు సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున ఇప్పుడే కాలువలోని సిల్టును తొలగిస్తే బాగుంటుందని రైతులు వాపోతున్నారు.

Also Read: Software Employee Arrest: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లక్షల జీతం వదిలి డ్రగ్స్ దందా!

 

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?