Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలందరూ అప్పులు చేస్తున్నారు.ఎవరి దగ్గరో తెలుసా సాక్షాత్తు ఆ భగవంతుడి దగ్గరే ఋణం తీసుకుంటున్నారు.20 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతుందని వారు అంటున్నారు.
మనలో చాలామంది సాధారణంగా అప్పు తీసుకోవడానికి ఆలోచిస్తుంటారు. అప్పు ఉండడం ఎందుకని అనేకమంది వెనకడుగు వేస్తారు. కానీ ఈ ఊరిలో మాత్రం ప్రతి ఒక్కరు తప్పకుండా అప్పులు చేస్తుంటారు. అది కూడా వ్యక్తులు బ్యాంకులో వద్ద కాదు, ఏకంగా సీతారామచంద్ర స్వామి వద్దే అప్పు చేస్తుంటారు. ఇక్కడి గ్రామస్తులు తీసుకున్న అప్పుకు తప్పనిసరిగా వడ్డీ కూడా చెల్లిస్తుంటారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా…?
అశ్వాపురం మండల కేంద్రనికి కూతవేటు దూరంలో ఉన్న ఎస్సీ కాలనీ లో 350 కుటుంబాలు నివసిస్తుంటాయి. ఈ గ్రామ వాసులంతా సీతారామచంద్రస్వామి వద్ద అప్పు తీసుకోవడాన్ని మంచిదని భావిస్తుంటారు. ఈ సాంప్రదాయం గత 20 ఏళ్లుగా కొనసాగుతుంది గ్రామస్తులకు ఎవరికైనా సరే కనీసం 6000 వరకు ఇస్తుంటారు ఇంకా ఈ గ్రామస్తులు సీతారామచంద్రస్వామి వద్ద తీసుకున్న రుణాలు తప్పనిసరిగా తీరుస్తుంటారు.
Also read: Naini Coal Block: యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయ మిది.. భట్టి విక్రమార్క
తీసుకున్న అప్పును ఏడాదిలోపు కచ్చితంగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సీతారామచంద్ర స్వామి కి ఆ గ్రామమంతా దాదాపుగా 20 లక్షల పైనే అప్పు ఉన్నారట.అప్పుకు సంబంధించిన లెక్కలు పర్యవేక్షించడానికి, గ్రామస్తులంతా కలిసి ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసుకుంన్నారు. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ నిర్వహణకు ఉపయోగిస్తుంటారు.
ఎక్కడివి ఈ డబ్బులు
20 ఏళ్ల క్రితం ఆలయంలో హోమాయగాల కార్యక్రమం నిర్వహించగా ఆదాయం వచ్చింది. అయితే ఈ నగదును ఎక్కడ ఖర్చు చేయకుండా గ్రామస్తులకు రుణం ఇవ్వాలని అప్పట్లో ఆలయ కమిటీ నిర్ణయించింది. ఫలితంగా అప్పటినుండి గ్రామస్తులకు రుణాలు ఇవ్వడం ప్రారంభమైంది. గ్రామంలో చాలా మంది సీతారామచంద్రస్వామి వద్ద అప్పు తీసుకుని ప్రారంభిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తిఅయితాయని భావిస్తారు.
సీతారామచంద్ర స్వామి వద్ద నుంచి తీసుకున్న అప్పుతో ఎంతో ఐశ్వర్యం కలుగుతుంది. వ్యాపారం, వాణిజ్యం అభివృద్ధి చెందుతుందని, ఫలితంగా గ్రామంలో ప్రతి ఒక్కరు అప్పు చేసేందుకు వస్తుంటారు అని గ్రామస్తులు చెప్తున్నారు. మరోవైపు దీనిని గమనించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా సీతారామచంద్రస్వామి వద్ద అప్పు తీసుకునేందుకు బారులు తీరారట.కానీ ఈ అవకాశం కేవలం ఎస్సీ కాలనీ వాసులకు మాత్రమే ఉందని నిర్వాహకులు స్పష్టం చెప్తున్నారు.