SP Akhil Mahajan (imagecredit:swetcha)
ఆదిలాబాద్

SP Akhil Mahajan: కాలీగా తిరిగితే జైలుకే యువతకు వార్నింగ్.. ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్ బ్యూరో స్వేచ్ఛ: SP Akhil Mahajan: అర్ధరాత్రి పట్టణాలలో అనవసరంగా, అకారణంగా తిరిగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ఛబుత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గత రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో రాత్రి 12 గంటల సమయంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా యువత ప్రజలు పెద్ద ఎత్తున అకారణంగా అనవసరంగా సంచరించినట్లు గుర్తించామని వివరించారు.

150 మందిని ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. తదుపరి యువతను వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందన్నారు. ఇలా ఆదిలాబాద్ పట్టణంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, పదేపదే సంచరిస్తూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.

Also Read: Commissioner Sudheer Babu: నేరాల నియంత్రణకు వీటితో చెక్ పెట్టొచ్చు.. అవేంటంటే!

అకారణంగా ఎవరైనా రోడ్లపై, గద్దెలపై హోటళ్ల ముందు భాగంలో, ప్రధాన కూడళ్ల వద్ద, వారి వారి వీధులలో అనవసరంగా కూర్చోకూడదని సూచించారు. ముఖ్యంగా పట్టణంలో రాత్రి 10:30 తర్వాత అత్యవసర దుకాణాలు మినహా మిగిలిన వ్యాపార సమూహాలన్నీ మూసి వేయబడతాయని తెలిపారు. అందుచేత ప్రజలు, యువత బయట తిరగడం కూర్చోవడం లాంటివి చేయకూడదన్నారు.

అర్ధరాత్రి పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణం కలుగజేయడానికి, యువత ఎలాంటి గొడవలకు దారి తీయకుండా ఉండేందుకు, ప్రమాదాల నివారణకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

గత రాత్రి నిర్వహించిన ఆపరేషన్ లో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, కరుణాకర్, రూరల్ సీఐ ఫనిధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి,బి శ్రీపాల్, ఎన్ చంద్రశేఖర్, ఎస్ఐలు ముజాహిద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ