మేడ్చల్ స్వేచ్ఛ: Commissioner Sudheer Babu: నేరాల నియంత్రణకు సాంకేతికత ద్వారా అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ పటిష్ఠ చర్యలు చేపడుతోందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. నిరంతరం పహారా కాస్తూ ఎక్కడ నేరం జరిగినా నమోదు చేసేలా సీసీటీవీల ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలిపారు.
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్లో రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి జోన్ లోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన 1460 సీసీ కెమెరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని,సీసీ కెమెరాల వల్ల భద్రత ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివారణకు రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ప్రస్తుతం 410 కెమరాలను పనిచేస్తున్నాయని మిగతావి మరి కొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ పీవీ పద్మజ, కుషాయిగూడ ఎసిపి తాళ్ళపెల్లి మహేష్, సిఐలు భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్,సైదులు,తదితరులు పాల్గొన్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/