Electric SUV : పోర్షే తన మొదటి ఎలక్ట్రిక్ లగ్జరీ SUV అయిన Porsche Cayenne Electric ను నవంబర్ 20, 2025న భారత్‌లో లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో ఈ కారు వచ్చింది. స్టాండర్డ్ మోడల్ ధర రూ. 1.76 కోట్లు, హై-పర్ఫార్మెన్స్ Turbo Electric వేరియంట్ ధర రూ. 2.26 కోట్లు. పోర్షే చెబుతున్నట్లు, ఇది వారి ఎలక్ట్రిక్ స్ట్రాటజీలో చాలా పెద్ద అడుగు. Cayenneకు ఉన్న పేరును, కొత్త EV టెక్నాలజీతో కలిపి మార్కెట్లోకి తీసుకొచ్చిన మోడల్ ఇదే.
పర్ఫార్మెన్స్ విషయంలో Turbo Electric అసలు బీభత్సం. 1,156 hp పవర్, దాదాపు 1,150 Nm టార్క్‌తో 0–100 కి.మీ వేగాన్ని కేవలం 2.5 సెకన్లలో అందుకుంటుంది. టాప్ స్పీడ్ 260 km/h. స్టాండర్డ్ వేరియంట్ కూడా బలహీనమే కాదు. 408 hp పవర్, 835 Nm టార్క్‌తో 0–100 km/h ను 4.8 సెకన్లలో అందుకుంటుంది. పోర్షే ప్రకారం, ఇప్పటివరకు వచ్చిన ఎలక్ట్రిక్ SUVల్లో ఇది అత్యంత శక్తివంతమైనది.
రెండు మోడళ్లలోనూ 113 kWh పెద్ద బ్యాటరీ, డ్యూయల్ మోటార్లు, ఆల్-వీల్ డ్రైవ్ ఉన్నాయి. రేంజ్ కూడా బాగానే ఉంది. స్టాండర్డ్ Electric 642 km వరకూ, Turbo 623 km వరకూ వెళ్లగలదు. 800-వోల్ట్ టెక్నాలజీతో 400 kW ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. 10% నుండి 80% వరకు చార్జ్ కావడానికి కేవలం 16 నిమిషాలు చాలు. ముఖ్యంగా .. పోర్షే మొదటిసారి ఈ కారులో 11 kW వైర్‌లెస్ చార్జింగ్ ఆప్షన్ ఇచ్చింది. కేవలం ప్యాడ్‌పై పార్క్ చేస్తే చాలు, కేబుల్ అవసరం లేదు.
సౌకర్యాల విషయంలో కూడా ఇది ఏ మాత్రం తగ్గలేదు. ICE Cayenne కంటే ఇది కొంచెం పొడవుగా, స్పేస్ కూడా ఎక్కువగా ఉంది. 781 లీటర్ల బూట్ స్పేస్, అదనంగా 90 లీటర్ల ఫ్రంట్ ఫ్రంక్ కూడా ఉంది. అందుకే పర్ఫార్మెన్స్‌తో పాటు ఇది ప్రాక్టికల్ SUVగానూ నిలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే, నంబర్ల ప్రకారం ఇది మార్కెట్లోకి వచ్చిన వేగవంతమైన ఎలక్ట్రిక్ SUVలలో ఒకటి. ఈ లాంచ్‌తో, భారత్‌లో లగ్జరీ EV సెగ్మెంట్ మరింత వేగంగా పెరగబోతుందనే చెప్పాలి.
