Ponnam Prabhakar: హుస్నాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Ponnam Prabhakar ( image Credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Ponnam Prabhakar: హుస్నాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయండి : మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: హుస్నాబాద్ ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ఉత్తర తెలంగాణ కోనసీమ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో పర్యటిస్తుండడంతో సిద్దిపేట కలెక్టర్ హైమవతి తో కలిసి సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు జన సమీకరణ బాగా జరుగుతుండడంతో పాటు వచ్చే వారికి తాగునీటి సౌకర్యాలు , పార్కింగ్ ప్రదేశాలు ,బద్రత తదితర వాటిపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా తో మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కి ,ATC (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్)కు శంకుస్థాపన చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

10 కోట్ల రూపాయల తో అర్బన్ పార్క్ ఏర్పాటు కు శంకుస్థాపన

రాజీవ్ రహదారి నుండి హుస్నాబాద్ వరకు 4 లేన్ కు, అక్కన్నపేట నుండి హుస్నాబాద్ రోడ్డుకు ,కోహెడ లో నిర్మించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి ,గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్ ,వెటర్నరీ హాస్పిటల్ ,ఫిష్ మార్కెట్ , వెజిటబుల్ మార్కెట్ ప్రతిపాదనలు చేశారని వాటికి సంక్షన్ రాగానే వాటి శంకుస్థాపన చేస్తామని తెలిపారు.హుస్నాబాద్ మున్సిపాల్టీ అభివృద్ధికి కేటాయించిన 20 కోట్లు అభివృద్ధి పనులకు , 8 కోట్ల రూపాయలతో హుస్నాబాద్ లో అధునాతన డ్రైవింగ్ ట్రాక్ తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి ,6 కోట్ల రూపాయల తో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు కు , ఉమ్మాపూర్ లో ఉన్న ఫారెస్ట్ లో వాకింగ్ ట్రాక్, ఇతర మౌలిక సదుపాయాలతో 10 కోట్ల రూపాయల తో అర్బన్ పార్క్ ఏర్పాటు కు శంకుస్థాపన చేస్తారు.

70 మంది విద్యార్థులకు సైకిల్ లు పంపిణీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి కింద మహిళా సంఘాల కింద బస్సులు ఇస్తారు. హైదరాబాద్ నుండి హుస్నాబాద్ ఎక్స్ ప్రెస్ బస్సు ప్రారంభిస్తారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు హాస్టల్ కి వెళ్లడానికి దూరం అవుతుండడంతో 70 మంది విద్యార్థులకు సైకిల్ లు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఫేజ్ 1 కింద కరీంనగర్ కొత్తపల్లి హుస్నాబాద్ కి ఫోర్ లైన్ రోడ్డు కి ,250 పడకల ఆసుపత్రి కి శంకుస్థాపన చూసుకొని పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎల్లమ్మ చెరువు , మహా సముద్రం గండి టూరిజం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.పల్లె చెరువు ,కొత్త చెరువు అభివృద్ధి జరుగుతుందన్నారు. హుస్నాబాద్ లో రింగ్ రోడ్డు ఉండాలి ,కబడ్డీ అకాడమీ , డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ , స్టేడియం అభివృద్ధి ,డిగ్రీ కాలేజీ పక్కన స్థలంలో పార్క్ అభివృద్ధి కి ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: Ponnam Prabhakar: గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

ఎల్కతుర్తి లో జంక్షన్ అభివృధి

వంగర లో నవోదయ పాఠశాలకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎల్కతుర్తి లో జంక్షన్ అభివృధి చేసుకున్నామని అక్కడే ఐఐటీ బాసర ఏర్పాటు కు కృషి చేస్తున్నాంమని హామీ ఇచ్చారు. గోడౌన్ ల నిర్మాణాలకు మంజూరు అయిందనీ,హుస్నాబాద్ లో పారిశ్రామిక కారిడార్ కి భూసేకరణ పూర్తయిందని దీని ద్వారా ఉపాధి కల్పన జరిగి ఆర్థిక వృద్ధి సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గౌరవెల్లి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు అవుతున్నాయని ప్రాజెక్ట్ పూర్తి చేసి హుస్నాబాద్ సస్య శ్యామలం చేస్తామని తెలిపారు.ప్రజా పాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు , సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు , మహిళలకు చీరలు, సున్నా వడ్డీ రుణాలు , పంపిణీ జరుగుతుందని ,గ్రామగ్రామాన స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామని తెలిపారు.

సర్పంచ్ ఎన్నికల్లో నేతలకు దిశా నిర్దేశం

ముఖ్యమంత్రి పర్యటన సర్పంచ్ ఎన్నికలపై చిగురు మామిడి, హుస్నాబాద్ రూరల్ , టౌన్ , ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయడానికి జన సమీకరణ లో భాగంగా ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు పై నేతలకు దిశా నిర్దేశం చేశారు.నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయాలనీ సూచించారు. అందుకోసం నేతలంతా సమన్వయం చేసుకోవాలని సూచించారు.

నేతలు స్థానిక నేతల సమ్మతితో చేరేలా చర్యలు తీసుకోవాలి

పార్టీ బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటూ ఇతర పార్టీల నుండి చేరాలనుకునే నేతలు స్థానిక నేతల సమ్మతితో చేరేలా చర్యలు తీసుకోవాలని మండల అధ్యక్షులకు సూచించారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థి ఒక్కరే ఉండి వారు గెలవడానికి మిగిలిన నేతలంతా ఐక్యంగా పని చేయాలనీ ఆదేశించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అయిన నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు ,మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు,200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, సన్న వడ్లు బోనస్ , రుణమాఫీ ,రైతు భరోసా , ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తన గెలుపు కు ఎలా పని చేశారో మీ అందరి గెలుపు కోసం పనిచేస్తా అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమ పరిశీలనలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏఎంసీ చైర్మన్లు కంది తిరుపతిరెడ్డి, బోయిని నిర్మల జయరాజ్, హుస్నాబాద్ మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్, మాజీ కౌన్సిలర్లు వల్లపు రాజు, భూక్య సరోజున, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంక చందు, మంద ధర్మయ్య, ఓయూ జెఏసి నాయకులు గంపల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బిఖ్యా నాయక్, యాదవ రెడ్డి,కంది తిరుపతి రెడ్డి, మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాయిని రజిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి .హసన్, సంజీవరెడ్డి, వి. వెంకటరమణ, కేశవేని రమేష్, పెరుమాండ్ల నర్సా గౌడ్, మైదం శెట్టి వీరన్న, అయిత శ్రీధర్ తిరుపతి, కోమటి సత్యనారాయణ, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ, నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Ponnam Prabhakar: ఓవర్ లోడ్ తో వాహనం పట్టుబడితే పర్మిట్ రద్దు చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

Just In

01

Job Scam: విదేశీ ఉద్యోగం అని గంతేస్తున్నారా? యువత సైబర్ క్రిమినల్స్ ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం!

Apple Phones: ఐఫోన్ యూజర్స్‌కి గుడ్‌న్యూస్.. చాట్‌జీపీటీని ఒక్క టచ్‌తో స్టార్ట్ చేయండి!

Lady Boss Bad Touch: లేడీ బాస్ వేధిస్తోంది.. అసభ్యంగా తాకుతోంది.. యువ ఉద్యోగి ఆవేదన

Samantha Wedding: దర్శకుడు రాజ్ నిడమోరును పెళ్లి చేసుకున్న సమంత రూత్ ప్రభు.. ఎక్కడంటే?

Local Body Elections: నగదు లేకుంటే బరిలోకి రాకండి.. ఆశావహులకు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీల ఆదేశాలు!