Ponnam Prabhakar: గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి
Ponnam Prabhakar ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Telangana News

Ponnam Prabhakar: గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: గీత వృత్తి బతకాలంటే తాటి, ఈత మొక్కలు పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  గీతాపనివారల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘నేను మీ బిడ్డను ,సర్వాయి పాపన్న వారసుడిని ,ఎల్లమ్మ తల్లి బిడ్డను..సంఘ సమస్యల పరిష్కారం కోసం అండగా ఉంటా’నని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రభుత్వం పక్షాన వృత్తిపరంగా కుల సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు తీసుకుపోతానన్నారు. ప్రభుత్వం తరుపున 45 లక్షల ఈత తాటి మొక్కలు పెట్టామన్నారు. ప్రభుత్వం మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

Also Read: Ponnam Prabhakar: రోడ్డు ప్రమాదాలపై ఇలాంటి అవగాహన అవసరం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి

గుంత తవ్వి రక్షించే వరకు బాధ్యత ప్రభుత్వానిది అన్నారు. మనం తిన్నా తినకున్న మన పిల్లలను మంచి చదువులు అందించాని సూచించారు. ఎక్స్ గ్రేషియా , కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ ,గీత సమస్యల పరిష్కారం అన్నిటికి ప్రభుత్వం నుండి అండగా ఉంటానని, మనం ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని సూచించారు. ధర్మ బిక్షం అంటే నాకు గౌరవం.. ఆయన ఆశయాలకు కొనసాగిస్తామన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు

నేను , పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఊర్లలో మనం మన తాకత్ పెంచుకోవాలి..అందరిని ఐక్యంగా కలుపుగోలుగా ఉన్నప్పుడే సాధ్యం అవుతుందని, ఎవరికి కించపరచద్దు.. అప్పుడే ఊర్లలో నాయకత్వం పెరుగుతుందన్నారు. వృతి పరంగా ఏ సమస్య వచ్చిన ప్రభుత్వం లో నా గొంతు కోట్లాడుతుందన్నారు. ఎక్స్ గ్రేషియా విడుదల ,ఈత తాటి మొక్కల పెంపకం ,కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ అన్ని ప్రభుత్వం నుంచి అమలయ్యేలా చూస్తామన్నారు.

Also Read: Ponnam Prabhakar: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక!

Just In

01

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!

RTC Officer Died: ఆర్‌టీసీ డిప్యూటీ ఆర్‌ఎం వెంకట్ రెడ్డి పాడె మోసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Naini Coal Block: బొగ్గు బ్లాక్ టెండర్లపై ఆరోపణల వేళ.. మాజీ మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్

Anasuya Bharadwaj: హత్యాచారం చేసిన వారికి మరణశిక్ష బిల్‌.. అనసూయ షాకింగ్ పోస్ట్!