Poco C85 5G: పోకో సిరీస్ నుంచి కొత్త మొబైల్ ఇవాళ భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ అవుతోంది. లాంచ్‌కు కొన్ని గంటల ముందు నుంచే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక మైక్రోసైట్ నుంచి ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు ముందే లీక్ అయ్యాయి. దీంతో బడ్జెట్ 5G సెగ్మెంట్‌లో ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయిన Poco C85 5G, ఫీచర్లు చూస్తే యువతను లక్ష్యంగా పెట్టుకుని తీసుకొచ్చిన పవర్‌ఫుల్ ప్యాకేజీ అని చెప్పచ్చు.
డిజైన్ విషయానికి వస్తే, ఫోన్ మిస్టిక్ పర్పుల్, స్ప్రింగ్ గ్రీన్, పవర్ బ్లాక్ అనే మూడు అద్భుతమైన కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది. వీటన్నింటిలోనూ డ్యూయల్-టోన్ బ్యాక్ ప్యానెల్‌ని ఉపయోగించడంతో బడ్జెట్ సెగ్మెంట్‌లో కూడా ప్రీమియమ్ లుక్‌ను అందించేలా Poco శ్రద్ధ పెట్టింది. ముందుభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ ఉంటుండటం వల్ల స్క్రీన్ మరింత క్లీన్‌గా కనిపిస్తుంది.
Display విషయంలో Poco ఈసారి పెద్ద అప్‌గ్రేడ్ తీసుకొచ్చింది. 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, HD+ రిజల్యూషన్, 810 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తోంది. అంతేకాకుండా Low Blue Light, Flicker-Free, Circadian వంటి TÜV సర్టిఫికేషన్లు ఉండటం వల్ల దీర్ఘకాలం ఉపయోగించినా కళ్లకు హాని తగ్గుతుంది. ముఖ్యంగా 7.99mm స్లిమ్ బాడీతో వస్తున్నా, ఇందులో 6,000mAh భారీ బ్యాటరీని ఉపయోగించడం విశేషం.
పర్ఫార్మెన్స్ కోసం Poco C85 5Gలో MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది బడ్జెట్ రేంజ్‌లో మంచి 5G పనితీరు ఇచ్చే ప్రాసెసర్. కెమెరా సెగ్మెంట్‌లో 50MP AI ప్రధాన కెమెరా కన్ఫర్మ్ కావడంతో ఫోటోగ్రఫీ lovers కి మంచి ఆప్షన్. అంతే కాదు, అదనంగా, Poco రెండు సంవత్సరాల OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్‌ను హామీ ఇవ్వడం కూడా యూజర్లకు అదనపు బెనిఫిట్.
Poco C85 5G డిసెంబర్ 9న ఫ్లిప్‌కార్ట్ లో అధికారికంగా అమ్మకానికి వస్తోంది. ధర వివరాలు లాంచ్ ఈవెంట్‌లోనే ప్రకటిస్తారు. అయితే ఇప్పటి వరకు తెలిసిన స్పెక్స్ చూస్తే, బడ్జెట్ 5G సెగ్మెంట్‌లో ఈ ఫోన్ బలమైన పోటీదారుగా నిలిచే అవకాశాలు చాలా ఎక్కువ. Poco మళ్లీ తన బెస్ట్-వాల్యూ స్ట్రాటజీతో మార్కెట్‌లో ప్రభావం చూపించబోతుందని స్పష్టమవుతోంది.

