Oppo Reno 15: చైనాలో అధికారికంగా డెబ్యూ చేసిన తర్వాత Oppo Reno 15 సిరీస్ ఇప్పుడు గ్లోబల్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. కెమెరా ఫీచర్లు, క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టూల్స్‌తో ఈ సిరీస్, ఓప్పో తన ఇమేజింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో లాంచ్ టైమ్‌లైన్‌ను కంపెనీ ఇంకా ప్రకటించకపోయినా, పరిశ్రమ వర్గాలు Reno 15 సిరీస్ వచ్చే కొన్ని వారాల్లో మార్కెట్‌లోకి ముందే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి.
చైనాలో Reno 15 Pro ధర CNY 3,699 అంటే ఇండియన్ కరెన్సీ లో రూ.46,000. అయితే, భారత మార్కెట్‌కు వచ్చే స్టాండర్డ్ Reno 15 మోడల్ దీనికంటే తక్కువ ధరలో లభించవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. వేరియంట్ల ఆధారంగా ఈ ఫోన్‌ను రూ.32,000 నుంచి రూ.38,000 మధ్య ఓప్పో అందించే అవకాశం ఉంది. అధికారిక ధర మాత్రం లాంచ్ ఈవెంట్ నాటికే వెల్లడవుతుంది.
ఫీచర్ల పరంగా, Reno 15 సిరీస్, మెరుగైన కెమెరా పనితీరు, థర్మల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టనుందని తెలుస్తోంది. గ్లోబల్ వెర్షన్‌లలో ఉండే ColorOS 16, అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్స్, గేమింగ్, లైవ్ స్ట్రీమింగ్ వంటి హెవీ యూజ్ కోసం ఆప్టిమైజేషన్‌లు భారత వేరియంట్‌లో కూడా ఉండే అవకాశముంది. హై-రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
Pro మోడల్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే, స్టాండర్డ్ Reno 15లో కూడా తక్కువ వెలుతురు పరిస్థితుల్లో మంచి ఫలితాలు ఇచ్చే ప్రైమరీ కెమెరా, వైడ్-యాంగిల్, పోర్ట్రెట్ లెన్స్‌లు, AI ఆధారిత లైవ్ స్ట్రీమింగ్ ఎంహాన్స్మెంట్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, అదనంగా సుమారు 5,000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పనితీరును అందించే AI ఆప్టిమైజేషన్లు అందించబడే అవకాశముంది.
డిజైన్ పరంగా Reno 15 సిరీస్ ఫ్లాట్-ఫ్రేమ్ స్టైల్‌తో ప్రీమియమ్ లుక్‌ను అందించవచ్చు. మెరుగైన డ్యూరబిలిటీ రేటింగ్స్, పెరిగిన డిస్ప్లే బ్రైట్‌నెస్ కూడా ఈ సిరీస్ ప్రత్యేకతలు కావచ్చు. వ్లాగింగ్, ఫోటోగ్రఫీ, గేమింగ్ వంటి క్రియేటర్-సెంట్రిక్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత యువ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని Reno 15ను ఓప్పో ఒక శక్తివంతమైన ఆప్షన్‌గా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

