OnePlus 15R: వన్ ప్లస్ కంపెనీ ఇండియాలో తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ OnePlus 15Rను తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే OnePlus 15 లాంచ్ అయింది. ఇప్పుడు దాని తర్వాత వచ్చే పవర్‌ఫుల్ మోడల్‌గా 15Rపై ఫుల్ ఫోకస్ పెట్టింది కంపెనీ. అధికారిక మైక్రోసైట్ కూడా లైవ్ కావడంతో, ఫోన్‌లో ఏం ఉండబోతుందో చాలా వరకు క్లారిటీ వచ్చేసింది.
ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఎక్కడ దొరుకుతుంది?
OnePlus 15R డిసెంబర్ 17న ఇండియాలో లాంచ్ అవుతుంది. అదే రోజున OnePlus Pad Go 2 కూడా వస్తోంది. లాంచ్ అయ్యాక ఈ ఫోన్‌ను Amazonలో, OnePlus అధికారిక వెబ్‌సైట్‌లో, అలాగే దగ్గరలోని OnePlus షోరూమ్స్‌లో కొనొచ్చు.
Also Read: Ozempic Launched: యావత్ ప్రపంచం చర్చించుకుంటున్న ‘ఓజెంపిక్ ఔషధం’ భారత్‌లో విడుదల.. రేటు ఎంతంటే?
పనితీరు ఎలా ఉంటుంది?
ఈ ఫోన్‌లో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ ఇస్తున్నారు. అంటే గేమింగ్ అయినా, హెవీ యాప్స్ అయినా ఏదైనా ఈజీగా రన్ అవుతాయి. దీనికి LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ ఉండడంతో ఫోన్ హ్యాంగ్ అయ్యే ఛాన్స్ దాదాపు ఉండదు. యాప్స్ ఓపెన్ అవడం కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది.
బ్యాటరీ అంటే మామూలు కాదు
OnePlus 15Rలో ఉన్న 7,400mAh బ్యాటరీ అసలు హైలైట్. ఇది ఇప్పటివరకు OnePlus ఇచ్చిన అతిపెద్ద బ్యాటరీ. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గేమింగ్, వీడియోలు, ఆఫీస్ పనులు అన్నీ చాలా సేపు చేసుకోవచ్చు.
కంపెనీ చెప్పినట్టు ఈ బ్యాటరీ 4 ఏళ్ళ తర్వాత కూడా 80% సామర్థ్యం ఉంటుందట. అలాగే 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఛార్జింగ్ టైమ్ కూడా ఎక్కువ తీసుకోదు.
Also Read: Madhusudhan Reddy: సీఎం రేవంత్ హయాంలో సర్కారు కాలేజీలకు మహర్దశ : జీజేఎల్ఏ నేత మధుసూధన్ రెడ్డి!
స్క్రీన్ ఎలా ఉంటుంది?
ఈ ఫోన్‌లో 1.5K AMOLED డిస్‌ప్లే వస్తుంది. పైగా 165Hz రిఫ్రెష్ రేట్ ఉండడంతో స్క్రోల్ చేస్తే సూపర్ స్మూత్‌గా ఉంటుంది. బయట ఎండలో కూడా క్లియర్‌గా కనిపించేందుకు 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తున్నారు. రాత్రిపూట కళ్లకు ఇబ్బంది లేకుండా స్క్రీన్ 1 నిట్ వరకు తగ్గుతుంది. ఎక్కువసేపు ఫోన్ వాడేవాళ్లకి బాగా ఉపయోగపడేలా Eye Care సర్టిఫికేషన్ కూడా ఉంది.
కెమెరా పనితీరు ఎలా ఉంటుంది?
ఫోటోలు తీయడానికి ఈ ఫోన్‌లో 50MP Sony కెమెరా ఇస్తున్నారు. దీనికి OIS సపోర్ట్ ఉండడంతో షేక్ వచ్చినా ఫోటోలు బాగానే వస్తాయి. పక్కనే 8MP వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. పెద్ద కొత్త మార్పులు లేకపోయినా, రోజూ వాడుకునే ఫోటోగ్రఫీకి ఇది సరిపోతుంది.
ధర ఎంత ఉండొచ్చు?
ఇండియాలో OnePlus 15R ధర రూ.45,000 నుంచి రూ.50,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ముందు వచ్చిన OnePlus 13R ధరతో పోలిస్తే కొంచెం పెరుగుతుంది కానీ, ఫీచర్లు చూస్తే ఆ రేంజ్‌లో ఓకే అనిపిస్తుంది. మొత్తానికి చెప్పాలంటే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే కావాలనుకునేవాళ్లకి OnePlus 15R మంచి ఆప్షన్ అవుతుంది.

