Ozempic Launched: డయాబెటిస్, ఊబకాయ ట్రీట్‌మెంట్‌లో సరికొత్త శకానికి నాందిపలికిన బ్లాక్‌బస్టర్ ఔషధం ‘ఓజెంపిక్’ (Ozempic) భారత్‌లోనూ (Ozempic Launched) అధికారికంగా విడుదలైంది. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ (Novo Nordisk) ఇండియాలో అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ ఔషధం అందుబాటులోకి రావడంతో టైప్-2 డయాబెటిస్, ఊబకాయం (Obesity) సమస్యలకు అత్యాధునిక చికిత్సా విధానం భారతీయులకు అందుబాటులోకి వచ్చినట్టు అయ్యింది.
ఔషధం యొక్క సమగ్ర వివరాలుకూర్పు: ఓజెంపిక్‌లో ఉన్న క్రియాశీలక ఔషధం సెమాగ్లుటైడ్ (Semaglutide). ఇది శరీరంలోని సహజ హార్మోన్ అయిన GLP-1 (Glucagon-like Peptide-1) లాగా పనిచేస్తుంది.పనితీరు:ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.మెదడులోని ఆకలిని నియంత్రించే ప్రాంతాలపై పనిచేసి, ఆకలిని తగ్గిస్తుంది మరియు కడుపు నిండిన అనుభూతిని పెంచుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారిలో బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.దీర్ఘకాలంలో గుండె మరియు మూత్రపిండాలకు (Kidney) రక్షణ కల్పిస్తుంది.విధానం: ఇది వారానికి ఒక్కసారి చర్మం కింద (Subcutaneous) తీసుకోవాల్సిన ఇంజెక్షన్. ఇది ప్రీ-ఫిల్డ్ పెన్ రూపంలో లభిస్తుంది.
Read Also- C5 Alliance: ట్రంప్ మనసులో ‘సీ-5’!.. భారత్‌ను కలుపుకొని శక్తివంతమైన కూటమి ఏర్పాటుకు ప్రతిపాదన!
ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతదేశంలో ఓజెంపిక్ ఔషధం ధర డోస్ ఆధారంగా మారుతుంది. ఒక నెల అంటే, 4 వారాలకు సరిపడా డోసులు (ప్రారంభ డోస్ 0.25 ఎంజీ) రూ.8,800గా ఉంది. ఇక, 0.50 ఎంజీ ధర రూ.10,170, ఆ తర్వాత 1 ఎంజీ ధర రూ.11,175గా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఇతర దేశాల మార్కెట్లతో పోల్చితే మన దేశంలో రేట్లు తక్కువగానే అనిపిస్తున్నా, సాధారణ, మధ్యతరగతి వారికి ఈ ధరలు చాలా ఎక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్ కీలక మార్కెట్!
ఓజెంపిక్ మార్కెట్‌కు భారత్ అత్యంత ముఖ్యమైన మార్కెట్‌గా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, చైనా తర్వాత అత్యధిక టైప్-2 డయాబెటిస్ పేషెంట్లు భారతదేశంలోనే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ రోగులు మన దేశంలో సుమారుగా 10.1 కోట్ల మంది ఉంటారని అంచనాగా ఉంది. ఓజెంపిక్ అద్భుతంగా పనిచేస్తుండడంతో, దేశంలో డయాబెటిస్ చికిత్సా విధానంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also- Farmhouse Party: మద్యం మత్తు.. బర్త్ డే పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ జంట
జాగ్రత్తలు తప్పనిసరి
ఓజెంసిక్ ఔషధాన్ని టైప్-2 డయాబెటిస్ ఉన్న పెద్దవయస్కులకు మాత్రమే ఉపయోగించాలి. ఈ ఔషధాన్ని వాడేవారు చక్కగా ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. టైప్-1 డయాబెటిస్, లేదా సాధారణ బరువు తగ్గడానికి (Weight Loss) మాత్రమే వాడేందుకు అనుమతి ఉండదు. ఇక, సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే, వికారం, వాంతులు, మలబద్ధకం, మోషన్స్ వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స మొదలుపెట్టినప్పుడు ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించినా.. అవి క్రమంగా తగ్గుతాయి. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం చాలా అరుదుగా ఉంటుంది. అందుకే, ఈ ఔషధాన్ని తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

