The RajaSaab: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మకమైన సినిమా ‘ది రాజాసాబ్’. ఇప్పటికే ఈ సనిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు మారుతి ది లెగసీ ఆఫ్ ది రాజాసాబ్ అనే టైటిల్ తో ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ది రాజాసాబ్ ఎందుకు చూడాలో వివరంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికే భారీ అంచనాలు పెట్టకున్న అభిమానులకు ఇది కూడా తోడవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలో మారుతీ ఏం చెప్పుకు వచ్చారంటే?.. రాజాసాబ్ నాకు సుదూరమైన చర్చిపోలేని ప్రయాణం ఉంది. ఎన్నో సంవత్సరాల శ్రమ, పట్టుదలతో చేసిన సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను రంజింపజేయడానికి రెడీగా ఉంది. మీరు ది రాజాసాబ్ సినిమా థియోటర్లలో చూసే ముందు ఇది చూడండి. స్టోరీ నుంచి మ్యూజిక్ వరకూ.. యాక్షన్ నుంచి ఆర్ట్ వరకూ.. స్టైలింగ్ నుంచి వీఎఫ్ఎక్స్ వరకూ.. అన్నీ మీరు అనుకున్న దానికంటే వంద రెట్లు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఈ సినిమాకు రండి రాజాసాబ్ లెగసీ చూడటానికి. అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు.
Read also-Dhurandhar Gulf Ban: రణవీర్ సింగ్ సినిమాకు ఆ దేశాల్లో ఎదురు దెబ్బ.. ప్రదర్శనకు నో పర్మిషన్..
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తన అప్‌కమింగ్ భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘ది రాజాసాబ్’తో ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధమవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై, దర్శకుడు మారుతీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కేవలం యాక్షన్ చిత్రాలకే పరిమితం కాకుండా, ప్రభాస్ తన కెరీర్‌లో ఈసారి హారర్-కామెడీ, ఫాంటసీ అంశాలు కలగలిపిన సరికొత్త జోనర్‌ను ఎంచుకోవడం విశేషం. ‘ది రాజాసాబ్’ ప్రధానంగా వింటేజ్ సెట్టింగ్‌లో నడిచే ఫాంటసీ హారర్-కామెడీ చిత్రం. ఈ సినిమా పాత తరం కోట నేపథ్యంతో ముడిపడి ఉంటుంది. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దర్శకుడు మారుతీ తనదైన శైలిలో కుటుంబ అనుబంధాలు, కామెడీ టైమింగ్లను హారర్ అంశాలతో సమపాళ్లలో మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా ‘ది రాజాసాబ్ లెగసీ’ వీడియోలో స్పష్టం చేశారు.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. తమన్ మ్యూజిక్ అందించడం ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ అభిమానుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలకమైన సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టును టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్ మరింత హైలేట్ గా నిలుస్తున్నాయి. ఈ సినిమా జనవరి 9, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

