Akhanda 2 Producers: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapatri Srinu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుని ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam). ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ (14 Reels Plus) బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. గురువారం సాయంత్రం పడిన ప్రీమియర్లుకు మంచి స్పందనను అందుకున్న ఈ సినిమా.. శుక్రవారం మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. బాలయ్య గత కొన్ని సినిమాలన్నీ మొదట్లో ఇలాంటి మిక్స్‌డ్ టాక్‌తోనే మొదలై, బ్లాక్‌బస్టర్ విజయాలుగా మారాయి. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని నిర్మాతలు మీడియాకు తెలియజేశారు. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో హ్యాపీగా ఉన్నామని తెలిపేందుకు శుక్రవారం సాయంత్ర నిర్మాతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
Also Read- Bigg Boss Telugu 9: ఒక్కొక్కరినీ ఏడిపిస్తున్న బిగ్ బాస్.. సెకండ్ ఫైనలిస్ట్‌లో ట్విస్ట్ ఇదే!
ప్రస్తుతానికి మిక్స్‌డ్ టాక్
నిర్మాతలలో ఒకరైన నిర్మాత గోపి ఆచంట (Gopi Achanta) మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయాం. అందుకే ఒక వారం రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా మా బాలయ్య బాబుకు, డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు, బాలయ్య బాబు అభిమానులకు మా ప్రొడక్షన్ తరఫున సారీ చెప్తున్నాం. ఈ సమస్యని పరిష్కరించడానికి మ్యాంగో మీడియా రామ్, నిర్మాత దిల్ రాజు చాలా సపోర్ట్ చేశారు. వారికి ధన్యవాదాలు. ఒక వారం రోజులు ఆలస్యం అయినప్పటికీ డిసెంబర్ 11న ఈ సినిమా ప్రీమియర్స్‌తో రిలీజైంది. ప్రీమియర్స్‌కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. మేము భ్రమరాంబ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశాం. ఫ్యాన్స్ అసలు సీట్లో కూర్చోవడం లేదు.. నిలబడి చప్పట్లు, విజిల్స్‌తో అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఈరోజు మార్నింగ్, మ్యాట్నీ షోలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అన్ని ఏరియాల నుంచి మంచి కలెక్షన్స్, రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీలోనే నెగిటివిటీ ఉంది కానీ, బయటెక్కడా నెగిటివ్ రిపోర్ట్స్ రాలేదు. ప్రస్తుతానికి సినిమాపై మిక్స్‌డ్ టాక్ నడుస్తుంది. నార్త్‌లో జీ సినిమాస్ ద్వారా దాదాపు 800 స్క్రీన్స్‌లో రిలీజ్ చేశాం. 30 పర్సంట్ ఆక్యుపెన్సీ ఉంది. అక్కడ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ బ్రహ్మాండంగా ఉంది. టికెట్స్ బుకింగ్ కూడా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడి నుంచి ఎలా ప్రమోట్ చేయాలనే దానిపై దృష్టి పెట్టాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేయాలని భావిస్తున్నామని తెలిపారు.
Also Read- Come 2 Dhee Party: సుధీర్, హైపర్ ఆదిల ‘ఇయర్ ఎండింగ్ పార్టీ’ టీజర్ వచ్చింది చూశారా? మొత్తం పోతారు!
నాన్ కన్నడ సినిమాల్లో ఐదో సినిమా
నిర్మాత రామ్ ఆచంట (Ram Achanta) మాట్లాడుతూ.. ప్రీమియర్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. గురువారం రాత్రి జరిగిన ప్రీమియర్స్‌కు నైజాం, సీడెడ్, ఆంధ్ర కలిపి రూ. 10 కోట్ల గ్రాస్ చేసింది. కర్ణాటకలో కూడా దాదాపు కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. ప్రీమియర్స్‌లో కోటి రూపాయలు కలెక్ట్ చేసిన నాన్ కన్నడ సినిమాల్లో ఇది ఐదో సినిమాగా నిలిచింది. బుకింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా చాలా అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయి. శుక్రవారం ఈవినింగ్ నుంచి ఫ్యామిలీస్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి.. ఈ వీకెండ్‌కు అదిరిపోయే ఫిగర్స్ చూస్తామనే నమ్మకం ఉంది. సినిమా రిలీజ్ తర్వాత అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఓవర్సీస్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. గ్రౌండ్ రిపోర్ట్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. బాలయ్య బాబు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అద్భుతమైన సినిమా తీశారని ప్రశంసిస్తున్నారని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

