Bigg Boss Telugu 9: ఒక్కొక్కరినీ ఏడిపిస్తున్న బిగ్ బాస్.. ట్విస్ట్ ఇదే!
Bigg Boss Telugu 9 (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: ఒక్కొక్కరినీ ఏడిపిస్తున్న బిగ్ బాస్.. సెకండ్ ఫైనలిస్ట్‌లో ట్విస్ట్ ఇదే!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 95వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 95) కూడా సెకండ్ ఫైనలిస్ట్ నిమిత్తం కొన్ని రేసులు జరిగాయి. ఈ క్రమంలో భరణి అవుటై, తన దగ్గర ఉన్న మనీని, పాయింట్స్‌ని తనూజకు ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేశారు. ఈ విషయం ఇప్పటికే వచ్చిన ప్రోమో తెలియజేసింది. ఇప్పుడు మరో రెండు ప్రోమోలను బిగ్ బాస్ టీమ్ విడుదల చేసింది. ఈ ప్రోమోలలో సంజన వర్సెస్ ఇమ్మానుయేల్ అన్నట్లుగా యుద్ధం జరుగుతోంది. వారిద్దరిలో ఎవ్వరూ తగ్గడం లేదు. ఈ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో, హౌస్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయనేది ఈ ప్రోమోలు తెలియజేస్తున్నాయి. 95వ రోజు బిగ్ బాస్ హౌస్‌లో భారీ హైడ్రామా నడిచినట్లుగా ఈ ప్రోమోలు తెలియజేస్తున్నాయి. ఇందులో

Also Read- Come 2 Dhee Party: సుధీర్, హైపర్ ఆదిల ‘ఇయర్ ఎండింగ్ పార్టీ’ టీజర్ వచ్చింది చూశారా? మొత్తం పోతారు!

సంజన వర్సెస్ ఇమ్మానుయేల్

ఇమ్మానుయేల్, సంజనల మధ్య జరిగిన ఈ వాగ్వాదం (Emanual vs Sanjjanaa) తీవ్ర స్థాయికి చేరి, హౌస్ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు, వ్యక్తిగత అంశాలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది. సాధారణంగా, నామినేషన్ ప్రక్రియ, టాస్క్‌ల విషయంలో ఇటువంటి ఘర్షణలు చోటుచేసుకుంటాయి. వీరిద్దరి ఘర్షణపై వారంతపు ఎపిసోడ్‌లో చర్చించడానికి నాగార్జునకు కూడా ఓ పాయింట్ ఇచ్చినట్లయింది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారు, ఎవరికి మద్దతు ఇస్తారు? ఎవరిని మందలిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. షో ముగింపు దగ్గర పడుతున్న కొద్దీ, కంటెస్టెంట్‌ల మధ్య పెరుగుతున్న పోటీ, ఉద్వేగాలు ఈ ప్రోమో ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read- Krithi Shetty: బేబమ్మ బ్యాడ్ లక్.. ఆ సినిమా కూడా వాయిదా!

రెండో ఫైనలిస్ట్ ఎంపికపై ఉత్కంఠ

‘బిగ్ బాస్ తెలుగు 9’ గ్రాండ్ ఫినాలేకి అడుగు దూరంలో ఉన్న ఈ సమయంలో, హౌస్‌లో పోటీ మరింత తీవ్రమైంది. సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేందుకు తనూజ (Tanuja), ఇమ్మానుయేల్, సంజన మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ప్రోమోలో ముగ్గురికీ బిగ్ బాస్ ఓ టాస్క్ విధించారు. ఈ టాస్క్‌ ఆడుతున్న సమయంలో ఇమ్మానుయేల్ చేతిలోని కర్ర వచ్చి తనూజ తలకు తగిలింది. దీంతో ఆట ఆగిపోయినట్లుగా అర్థమవుతోంది. తనూజ ఒక్కసారిగా అరవడంతో.. అందరూ ఆమె చుట్టూ చేరారు. ఇమ్మానుయేల్ కావాలని చేయలేదు కానీ, తనూజకు మాత్రం గట్టిగానే తగిలినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇమ్మానుయేల్ బాధపడుతూ, ఎమోషనల్ అవుతున్నాడు. మొత్తంగా చూస్తే.. శుక్రవారం ఎపిసోడ్‌‌లో ఎక్కువగా ఎమోషనల్ మిక్స్ అయ్యేలా బిగ్ బాస్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే లీక్స్ ప్రకారం సెకండ్ ఫైనలిస్ట్ ఇప్పుడున్న ముగ్గురిలో ఎవరూ అవ్వలేదని తెలుస్తోంది. ఇదే ట్విస్ట్. అదేంటో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు