Come 2 Dhee Party: ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్ టీజర్ చూశారా?
Hyper Aadi vs Sudheer (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Come 2 Dhee Party: సుధీర్, హైపర్ ఆదిల ‘ఇయర్ ఎండింగ్ పార్టీ’ టీజర్ వచ్చింది చూశారా? మొత్తం పోతారు!

Come 2 Dhee Party: ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఈటీవీ (ETV) నూతన సంవత్సర వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. 2026కి గ్రాండ్‌గా స్వాగతం పలికేందుకు, తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేందుకు ఈటీవీ ‘కమ్ 2 ఢీ పార్టీ’ (Come 2 Dhee Party) పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. ఈ మెగా ఈవెంట్ యొక్క టీజర్ తాజాగా విడుదల కావడంతో, టీవీ ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ టీజర్‌లోనే ఈవెంట్ యొక్క ప్రధాన ఆకర్షణ ఏంటో తెలియజేశారు. అదేంటో కాదు, తెలుగు కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), హైపర్ ఆది (Hyper Aadi) మధ్య జరిగే హాస్యపూరిత మాటల యుద్ధం. తమదైన టైమింగ్, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈ ఇద్దరు స్టార్ కమెడియన్ల మధ్య క్లాష్ ఈ కార్యక్రమానికి హైలైట్‌గా నిలవనుందనేది ఈ టీజర్ తెలియజేస్తుంది.

Also Read- Krithi Shetty: బేబమ్మ బ్యాడ్ లక్.. ఆ సినిమా కూడా వాయిదా!

సుధీర్ గాడి పార్టీ

ఈ టీజర్‌ను గమనిస్తే.. ప్రారంభంలోనే సుడిగాలి సుధీర్ తనదైన స్టైల్‌లో.. ‘సుధీర్ గాడి పార్టీ అంటే ఇప్పటిదాకా వినడమే గానీ, చూసింది లేదు కదా.. ఇప్పుడు చూపిస్తా అసలు పార్టీ ఏంటో’ అంటూ సవాల్ విసరడం, దానికి హైపర్ ఆది నుంచి అంతే స్థాయిలో కౌంటర్లు పడటం టీజర్‌లో ప్రధానంగా కనిపిస్తుంది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూ, ఒకరిని మించి మరొకరు రెచ్చిపోయి ప్రదర్శన ఇవ్వడం ఈ టీజర్‌లో ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.

Also Read- Ustaad Bhagat Singh: ‘దేఖ్‌లేంగే సాలా’.. రికార్డులు బద్దలు కొడుతుంది.. సింగర్ కామెంట్స్ వైరల్

పోతారు, మొత్తం పోతారు

‘ఒక్కసారి ఊపొస్తే.. అమ్మ కొడుకులిద్దరికీ ఊపేస్తా రేయ్…’ అని సుధీర్, ఇంద్రజలను ఉద్దేశించి ఆది అంటే.. ‘నీకు ఊపు రావాలేమో నేను ఎప్పుడూ ఊపు మీదే ఉంటా.. పోతారు, మొత్తం పోతారు’ అంటూ సుధీర్ తనదైన దూకుడు ప్రదర్శించాడు. అందుకు ఆది ‘ఎవ్వరు పోరు.. మీ అమ్మ కొడుకులు ఇద్దరు బయటకి పోతారు’ అని రివర్స్ కౌంటర్ ఇవ్వడం ఈ ప్రత్యేక కార్యక్రమం ఎంత వినోదాత్మకంగా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది. టీజర్‌లోని ప్రతి సన్నివేశం ఈవెంట్‌పై అంచనాలను భారీగా పెంచుతోంది. వీరిద్దరి హాస్య పోరాటం మాత్రమే కాక, ఈ వేడుకలో డ్యాన్స్, యాక్షన్, మరెన్నో అద్భుతమైన ప్రదర్శనలు కూడా ఉండనున్నాయనేది ఈ టీజర్ క్లారిటీ ఇచ్చేసింది.

Come 2 Dhee Party టీజర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మంచి ఛాయిస్

కొత్త సంవత్సరం వేడుకలను మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకోవాలనుకునే తెలుగు ప్రేక్షకులకు ‘కమ్ 2 డీ పార్టీ’ కచ్చితంగా మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా, డిసెంబర్ 31వ తేదీన రాత్రి 9:30 గం.లకు ఈటీవీలో ఈ మెగా ఈవెంట్ (ETV New Year Event 2026) ప్రసారం కానుంది. ఈ టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. తెలుగు ప్రేక్షకులకు నవ్వుల ప్రయాణాన్ని అందించే ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు