Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలైన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో ఇప్పటికే విడుదలై వైరల్ అవుతోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ సింగిల్ ‘దేఖ్‌లేంగే సాలా’ ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 13న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రీసెంట్‌గా విడుదల చేసిన ప్రోమోలో ఆ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన రికార్డింగ్ సెషన్‌కు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ప్రతి ఒక్కరితో డ్యాన్స్ చేయిస్తుంది
ఇప్పటికే వచ్చిన ప్రోమోలో పవన్ కళ్యాణ్ స్టెప్స్ ఇరగదీసినట్లుగా హింట్ ఇచ్చారు. ఇప్పుడు సింగర్ మాట్లాడిన మాటలు వింటే.. పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు రావడం పక్కా. సింగర్ విశాల్ డడ్లానీ మాట్లాడుతూ.. ఈ వీడియో ఎవ్రీథింగ్‌ను బ్రేక్ చేస్తుంది.. నన్ను నమ్మండి. ఆయన క్రేజ్‌కి పిచ్చెక్కి పోతుందని చెబుతున్నారు. సింగర్ ఆ మాట అనగానే వెనుక ఉన్న హరీష్ శంకర్ బల్లను బాదుతూ కనిపించారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన మార్క్‌ను ఈ వీడియోలో కూడా ప్రదర్శిస్తున్నారు. సింగర్, దర్శకుడు, సంగీత దర్శకుడు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ ప్రతి ఒక్కరితో డ్యాన్స్ చేయిస్తుందని సింగర్ చెబుతుండటం చూస్తుంటే.. ఇక ఫ్యాన్స్‌ని పట్టుకోవడం కష్టమే. ఎప్పుడెప్పుడు ఈ పాటను విడుదల చేస్తారా? అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదే విషయాన్ని కామెంట్స్‌లో కూడా తెలియజేస్తున్నారు.
Also Read- Samantha and Raj: సమంత-రాజ్ నిడిమోరుల పెళ్లిపై అరుదైన ఫొటోతో రాజ్ సోదరి షీతల్ పోస్ట్ వైరల్..!
ఏప్రిల్ 2026లో విడుదల
ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నిర్మాతలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులను, మాస్ ప్రేక్షకులను, యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఈ సినిమా ఉంటుందని హామీ ఇచ్చారు. నిర్మాణ విలువలు, సాంకేతిక అంశాల్లో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్టైల్, హరీష్ శంకర్ టేకింగ్ కలగలిపిన ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తాడో తెలియాలంటే మాత్రం వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2026, ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోతో, రిలీజ్‌కు ముందే సినిమాపై మరింత భారీ హైప్‌ను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
THIS SONG CAN MAKE ANYONE DANCE 🔥🔥
The energy of @harish2you, @ThisIsDSP and @vishaldadlani from the song recording session says it all 💥💥#DekhlengeSaala out on December 13th ❤🔥
Song Promo ▶️ https://t.co/YykzNUbllp#UBSFirstSingle 🕺🏻🔥#UstaadBhagatSingh
POWER STAR… pic.twitter.com/tJrFBjqkwa— Ustaad Bhagat Singh (@UBSTheFilm) December 11, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

