Krithi Shetty: బేబమ్మ బ్యాడ్ లక్.. ఆ సినిమా కూడా వాయిదా!
Krithi Shetty (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Krithi Shetty: బేబమ్మ బ్యాడ్ లక్.. ఆ సినిమా కూడా వాయిదా!

Krithi Shetty: టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ (Uppena)తో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చి, కుర్రకారు గుండెల్లో ‘బేబమ్మ’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న నటి కృతి శెట్టి (Krithi Shetty)కి ప్రస్తుతం పరిస్థితులు ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఆరంభంలో వచ్చిన రెండు విజయాల తర్వాత, ఈ అందాల తారకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో, సినిమాల విషయంలో ఆమెకు ‘బ్యాడ్ లక్’ వెంటాడుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా కృతి శెట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండు సినిమాలు కూడా విడుదల విషయంలో ఊహించని అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. ముందుగా కార్తి సరసన నటించిన ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vostaru) చిత్రం డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా, నిర్మాత పాత బకాయిలకు సంబంధించిన న్యాయ వివాదాల కారణంగా అనూహ్యంగా వాయిదా పడింది. ఈ వార్తతో నిరాశ చెందిన కృతికి, మరో షాక్ తగిలింది.

Also Read- Samantha and Raj: సమంత-రాజ్ నిడిమోరుల పెళ్లిపై అరుదైన ఫొటోతో రాజ్‌ సోదరి షీతల్ పోస్ట్ వైరల్..!

బ్యాక్ టు బ్యాక్ షాక్స్

ఆమె నటించిన మరో చిత్రం, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Love Insurance Kompany) కూడా నిర్ణయించిన తేదీకి విడుదల కావడం లేదు. వాస్తవానికి ఈ సినిమాను డిసెంబర్ 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, లేటెస్ట్ సమాచారం ప్రకారం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో ఈ సినిమా విడుదలను కూడా మేకర్స్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వరుసగా రెండు సినిమాలు విడుదల విషయంలో ఎదురుదెబ్బలు తగలడంతో.. సినిమా విడుదల విషయంలో తన పాత్ర లేకపోయినా, సోషల్ మీడియాలో కృతి శెట్టిపై ట్రోలింగ్ మొదలైంది. కొందరు ఆమెను ‘ఐరన్ లెగ్’ అంటూ కామెంట్లు చేస్తుండటం బాధాకరం. ఇందులో ఆమె తప్పేమీ లేకపోయినా, ఈ పరిస్థితులన్నిటికీ ఆమెనే టార్గెట్ చేయడం ఎంతవరకు సబబు అనేలా ఆమె అభిమానులు ప్రశ్నిస్తుండటం విశేషం.

Also Read- Kissik Talks With Varsha: ఏడాది పాటు బెడ్ రెస్ట్‌లోనే.. మెగాబ్రదరే హెల్ప్ చేశారు- ట్రాన్స్ గర్ల్ బిగ్ బాస్ పింకీ!

బ్యాడ్ లక్ కాకపోతే మరేంటి?

చిన్న వయసులోనే విజయాన్ని అందుకోవడంతో అంతా సాఫీగా సాగుతుందని అనుకున్న కృతి శెట్టి, వరుస ఫ్లాపులు, సినిమాల వాయిదాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ విషయం స్వయంగా ఆమెనే తన తాజా ఇంటర్వ్యూలో చెప్పింది కూడా. ఈ క్రమంలో నటనకు స్వస్తి చెప్పాలని కూడా అనుకున్నట్లు ఆమె వెల్లడించడం తెలిసిందే. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాకు 100 పర్సంట్ ఎఫర్ట్ పెట్టానని చెబుతున్న కృతి శెట్టిలో టాలెంట్, అంకితభావం లేదని చెప్పలేం. కానీ టార్గెట్ మాత్రం కృతి శెట్టే అవుతుందంటే.. బ్యాడ్ లక్ కాకపోతే మరేంటి? ఈ తాత్కాలిక ఎదురుదెబ్బలను అధిగమించి, త్వరలోనే భారీ విజయాలతో బేబమ్మ తిరిగి పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ వాయిదాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?