Cricketer Retirement: టీమిండియాలో వరుసగా రిటైర్మెంట్స్ చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. స్టార్ బ్యాటర్లుగా ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పటికే టీ-20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని నుంచి ఇప్పటికీ అభిమానులు తేరుకోలేదు. ఈ క్రమంలోనే ఈ ద్వయం టెస్ట్ క్రికెట్ (Test Cricket) కు సైతం వీడ్కోలు పలకడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. తొలుత రోహిత్.. ఆ తర్వాత కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మరో స్టార్ క్రికెటర్ సైతం క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశమున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేపో మాపో అతడి నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటన రావొచ్చని అంటున్నారు.
రిటైర్మెంట్ లోడింగ్!
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా ముందు వరుసలో ఉంటాడు. టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన కనబరిచి
టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. 2024 జూన్ లో జరిగిన టీ-20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీతో పాటు తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. తాజాగా ఆ ఇద్దరు టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో వారి బాటలోనే జడ్డూ కూడా నడవబోతున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై జడ్డూ అధికారిక ప్రకటన కూడా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
బ్యాటింగ్ గణంకాలు
జడ్డు టెస్ట్ ఫార్మెట్ విషయానికి వస్తే.. అతడు 2012 డిసెంబర్ 13న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 74 మ్యాచ్ లు ఆడిన జడ్డూ.. 35.69తో 3,177 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 21 అర్ధసెంచరీలు ఉన్నాయి. శ్రీలంకపై చేసిన 175* పరుగులు హైస్కోర్ గా ఉంది. టెస్టుల్లో వేగంగా 2000 పరుగులు, 200 వికెట్లు తీసిన ఐదో భారతీయ ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించాడు.
Also Read: Janulyri : జాను లిరీతో బ్రేకప్ అయ్యాక 24 గంటలు అలా చేసే వాడ్ని.. చనిపోదామనుకున్నా.. డాన్సర్ టోనీ
బౌలింగ్ గణాంకాలు
టెస్టుల్లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ జడ్డూ తిరుగులేని ఘనతలు సాధించాడు. 74 టెస్టుల్లో ఏకంగా 314 వికెట్లు పడగొట్టాడు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 7/42 అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. తన బౌలింగ్ లో 14 సార్లు 5 వికెట్లు, 2 సార్లు 10 వికెట్ల ఘనతను జడ్డూ సాధించాడు. 2025 ఫిబ్రవరిలో 600 అంతర్జాతీయ వికెట్ల మైలురాయిని సైతం జడేజా అందుకున్నాడు. 2025 మే నాటికి టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.