Janulyri : జాను లిరీతో బ్రేకప్ అయ్యాక చనిపోదామనుకున్నా..
Janulyri (Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Janulyri : జాను లిరీతో బ్రేకప్ అయ్యాక 24 గంటలు అలా చేసే వాడ్ని.. చనిపోదామనుకున్నా.. డాన్సర్ టోనీ

Janulyri :  డ్యాన్సర్ జాను లిరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో ఎన్నో ఫోక్ సాంగ్స్ చేస్తూ చాలా పాపులర్ అయింది. తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. అదే పాపులారిటీతో ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఢీ డాన్స్ షోలో ఎంట్రీ ఇచ్చిన జాను.. తన డాన్స్ తో ఆ సీజన్ విన్నర్ గా నిలిచింది. దీంతో, జాను గురించి ఏ చిన్న వార్త తెలిసిన వెంటనే వైరల్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఆమె మాజీ భర్త ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాను లిరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Samantha: దాని వలనే నా లైఫ్ నాశనమైంది.. చచ్చిపోదామనుకున్నా.. సమంత సంచలన కామెంట్స్

జాను లిరీ , డాన్సర్ టోనీ కిక్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ విషయం తెలిసిందే. అయితే, వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. గత కొద్దీ రోజుల నుంచి జాను లిరి వార్తల్లో నిలుస్తుంది. ఎందుకంటే, త్వరలో ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుంది. అయితే, ఇటీవలే డాన్సర్ టోనీ కిక్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

Also Read: HPCL Recruitment 2025: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

డాన్సర్ టోనీ కిక్ మాట్లాడుతూ ” ఆమెతో బ్రేకప్ అయ్యాక బాధని తట్టుకోలేకపోయా.. చాలా రోజులు నరకం అనుభవించా.. చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళా.. 24 గంటలు డ్రింక్ చేస్తూ ఉండేవాడ్ని. అప్పుడు నేను ఉండే ఊరిలో డ్రింక్ కూడా దొరికేది కాదు. మర్చిపోవడానికి అది పక్కా కావాలి. మందు ఎక్కడా దొరుకుతుందా అని దాని కోసం వేరే ఊర్లు కూడా వెళ్ళేవాడ్ని. నన్ను చూసి నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాధ పడ్డారు. ఆ రోజూ చచ్చిపోయి ఉంటే ఈ రోజుకి నాలుగేళ్ళు అయి ఉండేది ” అంటూ తన వేదనని బయటకు చెప్పుకున్నాడు.

Just In

01

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..