Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరో నాగ చైతన్య తో విడాకులు తీసుకుని ప్రస్తుతం సామ్ సింగిల్ గా ఉంటుంది. కానీ, చైతూ మాత్రం శోభిత ధూళిపాళ్ళను రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. అయితే, ప్రస్తుతం సమంత సినిమాలు చేయకుండా నిర్మాతగా బాధ్యతలు తీసుకొని శుభం చిత్రంతో మన ముందకొచ్చింది. అల్మోస్ట్ సక్సెస్ అయినట్టే తెలుస్తోంది. శుభం మూవీకి ఆశించిన కలెక్షన్స్ రావడంతో ఆమె చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో సమంత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీ అయింది. అంతే కాదు, తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తుంది.
Also Read: Actress Ananya Nagalla: అలాంటివి ప్రమోషన్ చేస్తున్న అనన్య నాగళ్ల.. వామ్మో, ఇలా తయారయ్యిందేంటి?
సమంత మాట్లాడుతూ ” నేను ఒక ఏడాది నరకమనుభవించా.. ఆ బాధ ఎవరికి చెప్పలేను.. ఎలా అంటే సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయి. చనిపోయే వరకు వెళ్ళా ” అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. మరి సామ్ ను అంతలా బాధ పెట్టిన సంవత్సరమేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: IDBI Bank Recruitment: యువతకు గుడ్ న్యూస్.. బ్యాంక్ లో ఉద్యోగాలు .. వెంటనే, అప్లై చేసుకోండి!
తాజాగా సమంత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ” నా లైఫ్ లో అత్యంత విలువైన రోజులు చూశాను, అత్యంత కఠినమైన రోజులను కూడా చూశాను. అయితే, ఇప్పటి వరకు ఒక ఏడాది మాత్రం చాలా కష్ట పెట్టింది. అదే ఏదో కాదు 2021. 2021 నా లైఫ్ లో జరగాల్సిన చెడు మొత్తం జరిగిపోయింది. అంత చెడు జరుగుతుందని అసలు అనుకోలేదు. మొత్తం ఆ ఒక్క ఏడాదిలోనే జరిగిపోయింది. అప్పుడు నా జీవితం మీదే నాకు విరక్తి పుట్టింది.. ఎవరికీ చెప్పకుండా చచ్చిపోవాలనుకున్నాను. ఇంకా నా జీవితంలో ఏం మిగిలింది ఏముంది. ఇక్కడితో నా లైఫ్ ముగిసిపోతుందేమో అనుకున్నా.. కానీ ఆ తర్వాతే చాలా చాలా నేర్చుకున్నాను. గెలుపు కన్నా ఓటమే ఎక్కువ నేర్పుతుందని తెలుసుకున్నాను ” ఎమోషనల్ అవుతూ తెలిపింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.