Vaibhav Suryavanshi: సూర్యవంశీకి కేంద్రం అత్యున్నత అవార్డు
Vaibhav-Suryavamshi (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Vaibhav Suryavanshi: వైభవ్‌ సూర్యవంశీకి అత్యున్నత అవార్డ్.. అందజేసిన రాష్ట్రపతి ముర్ము

Vaibhav Suryavanshi: వయసు కేవలం 14 ఏళ్లే, కానీ, మైదానంలోకి దిగితే సిక్సర్లు, ఫోర్లతో అంతర్జాతీయ బౌలర్లకు సైతం చెమటలు పట్టిస్తున్న యంగ్, టాలెంటెడ్ క్రికెటర్‌ వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Suryavanshi) కేంద్ర ప్రభుత్వం అత్యున్నత బాల పురస్కారాన్ని ప్రదానం చేసింది. ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ను (PMRBP) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేతుల మీదుగా సూర్యవంశీ అందుకున్నాడు. ఢిల్లీలో శుక్రవారం నాడు బాలల పురస్కార అవార్డుల ప్రధాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డ్ సూర్యవంశీ కెరీర్‌లోనే అత్యుత్తుమ ఘట్టాల్లో ఒకటిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అవార్డ్ స్వీకరణ కార్యక్రమం ఇప్పటికే ముగియగా, శుక్రవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా సూర్యవంశీ కలవనున్నాడు. అవార్డులు గెలుచుకున్న ఇతర బాలలతో కలిసి మోదీతో ముచ్చటించనున్నాడు.

Read Also- Psycho Hulchul: తిరుమలలో సైకో హల్‌చల్.. చిన్నారుల వెంటపడుతూ.. చంపేస్తానని బెదిరింపులు

ఎందరికో ఆదర్శం

కాగా, నైపుణ్యానికి వయసుతో సంబంధం లేదని సూర్యవంశీ చాటిచెబుతున్నాడు. బీహార్‌కు చెందిన బుడతడు 2025లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు. వైభవ్ సూర్యవంశీ ఏదో ఒక మ్యాచ్‌లో రాణించడం కాదు. వరుసగా అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నాడు. అందుకే, ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో బీహార్ తరపున ఆడిన తొలి మ్యాచ్‌లో సూర్యవంశీ పెనుసంచలనం సృష్టించాడు. కేవలం 84 బంతుల్లోనే 190 పరుగుల భారీ స్కోరు సాధించాడు. అతిపిన్న వయసులోనే ఈ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విధంగా రికార్డులు బ్రేక్ చేసుకుంటూ దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ సీజన్-2025లోనూ మెరుపులు మెరిపించాడు. సెంచరీ కూడా బాదిపడేశాడు. దేశం దృష్టిని ఆకర్షిస్తున్న సూర్యవంశీ ప్రయాణం ఔత్సాహిక అథ్లెట్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ అవార్డు అతడి కెరియర్‌కు మాత్రమే కాకుండా, చాలామందికి ప్రేరణగా కూడా నిలిచే అవకాశం ఉంది.

Read Also- Phone Tapping Case: నేడు సాయంత్రం సీపీతో సమావేశం కానున్న సిట్ బృందం!

విజయ్ హజారే మ్యాచ్‌లకు దూరం

కాగా, అవార్డు స్వీకరించేందుకు ఢిల్లీకి వెళ్లడంతో విజయ్ హజారే ట్రోఫీలో మిగతా మ్యాచ్‌లకు వైభవ్ సూర్యవంశీ అందుబాటులో లేడు. ప్రతిష్టాత్మక అవార్డు కావడం, అందులోనూ రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా స్వీకరించాల్సి ఉండడంతో ఢిల్లీకి వెళ్లాడు. కాగా, ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 5 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. బాలలకు అత్యున్నత పౌర పురస్కారం ఇదే. ధైర్యసాహసాలు, కళలు-సంస్కృతి, పర్యావరణం, ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడా రంగాల్లో ప్రతిభ చాటినవారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.

Just In

01

GHMC: జీహెచ్ఎంసీలో మరోసారి అంతర్గత మార్పులు.. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఛాన్స్?

Brave boy Sravan: ఆపరేషన్ సింధూర్‌లో సైనికులకు సాయం.. 10 ఏళ్ల బాలుడికి ప్రతిష్టాత్మక కేంద్ర పురస్కారం

Medaram Temple: ప్రతి చిహ్నానికి ఆదివాసీ చరిత్రే ఆధారం.. నమస్తే తెలంగాణ కథనంపై ఆదివాసి సంఘాల ఆగ్రహం!

Seethakka: కనివిని ఎరుగని రీతిలో సమ్మక్క సారలమ్మ మహా జాతర.. మేడారం అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి!

Srinivasa Mangapuram: ఘట్టమనేని వారసుడి సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఏంటీ స్పీడూ?