IPL-2024 Amabati Rayudu Interesting Comments
స్పోర్ట్స్

IPL-2024: సీఎస్‌కే టీమ్‌కి రోహిత్ నాయకత్వం వహించాలన్న అంబటి

 

IPL-2024 Amabati Rayudu Interesting Comments: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఈ ఐపీఎల్ చివరిదని వస్తోన్న పలు రూమర్స్‌పై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్‌మెంట్‌ని ప్రకటిస్తే.. 2025 ఐపీఎల్‌లో CSK టీమ్ తరపున రోహిత్ శర్మ ఆడాలని కోరుకుంటున్నానంటూ తన మనసులోని మాటను అంబటి రాయుడు తెలిపారు.

రోహిత్ కూడా ధోనీలాగా నాయకత్వం వహించగలరని ధీమా వ్యక్తం చేశారు. మరో ఐదారేళ్లు రోహిత్ ఐపీఎల్‌కి ఆడగలరని అన్నారు. ఏ జట్టుకు కెప్టెన్ అవ్వాలనుకున్నా అవుతారని ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను వ్యక్తపరిచారు. రోహిత్ SRH కెప్టెన్ అవ్వాలని మరికొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Read More: WPL హిస్టరీ ఛేంజ్, మ్యాచ్‌లో హర్మన్ రికార్డుల మోత

ఇక గతంలో మాజీ ప్లేయర్ అంబటి రాయుడు రిటైర్‌మెంట్‌ని ప్రకటించారు. డిసెంబర్ 28న తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పిన సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరిన పది రోజుల్లోనే ఆ పార్టీని వీడటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Read More: దినేష్ కార్తీక్.. రిటైర్ అవుతున్నాడా?

ఇక ఇదిలా ఉంటే.. 2025 ఏడాదిలో ఐపీఎల్‌లో CSK టీమ్ తరపున రోహిత్ శర్మ ఆడితే బాగుంటుందంటూ తాను కోరుకుంటున్నానంటూ తన మనసులోని మాటను అంబటి రాయుడు తెలిపారు. ప్రస్తుతం అంబటి చేసిన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలను చేసినట్లు తెలుస్తోంది. ఇక అంబటి చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులు ఎలా తీసుకుంటారు. తన మనసులోని మాటలు నిజమవుతాయా లేక ధోని రిటైర్‌మెంట్ ప్రకటించకుండా ఐపీఎల్‌లో అలాగే కంటిన్యూ అవుతారా లేదా అనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!