Harman’s Records Broken In The Match : 2024 డబ్ల్యూపీఎల్ మ్యాచ్ పోటాపోటీగా సాగుతున్నాయి. ఈ లీగ్‌లో భాగంగా ముంబయి- గుజరాత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఏకంగా 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబయి ఒక బాల్ మిగిలుండగానే తన లక్ష్యాన్ని ఛేదించింది. ముంబయి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అసాధారణ ఇన్నింగ్స్‌తో తమ జట్టును విజయ పథకానికి చేర్చింది. దీంతో రెండో సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ముంబయి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్ హిస్టరీలో పలు రికార్డులను నమోదు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్లాగే ఆడిందని చెప్పాలి. డబ్ల్యూపీఎల్ హిస్టరీలోనే భారీ టార్గెట్‌ని ఛేదించిన జట్టుగా ముంబయి సరికొత్త రికార్డుని నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 190-7 స్కోర్ చేసి, ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం ఛేజింగ్‌లో ముంబయి అదరగొట్టిందనే చెప్పాలి. 191 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించి మహిళల ప్రీమియర్ లీగ్‌లో అతిపెద్ద టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా నిలిచింది. ఇదివరకు ఈ రికార్డ్ బెంగళూరుపై ఉండేది. గత సీజన్‌లో గుజరాత్‌తో అడిన మ్యాచ్‌లో బెంగళూరు 189 పరుగులు ఛేజ్ చేసి రికార్డు కొట్టింది.
Read More:దినేష్ కార్తీక్.. రిటైర్ అవుతున్నాడా?
ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యం ముంగిట ముంబయి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెచ్చిపోయి ఆడింది. 48 బంతుల్లో 95 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో బౌండరీల సునామీని కురిపించింది. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత బ్యాటర్‌గా హర్మన్ రికార్డ్ కొట్టింది. కాగా, ఇదివరకు ఈ రికార్డ్ దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ షఫాలీ వర్మ పేరిట ఉండేది.
ఆమె గత సీజన్‌లో బెంగళూరుపై 84 పరుగులు చేసింది. ఇక హర్మన్ తాజా ఇన్నింగ్స్‌తో ఆ రికార్డులను బ్రేక్ చేసింది. ఓవరాల్‌గా హర్మన్ది టాప్- 3 స్కోరర్‌గా నిలిచారు. ఈ లిస్ట్‌లో సోఫీ డివైన్ 99, అలీసా హీలీ 96 పరుగులు ఉన్నారు.గతేడాదిలో స్టార్ట్ అయిన డబ్ల్యూపీఎల్‌లో హర్మన్‌ప్రీత్ ప్రస్తుతం అత్యధిక సగటు కలిగిన బ్యాటర్‌గా కంటిన్యూ అవుతోంది.
Read More: గిల్.. అద్భుతమైన క్యాచ్
ఇప్పటివరకు హర్మన్ 14 మ్యాచ్‌ల్లో 51.60 సగటుతో 516 పరుగులు చేసింది. కాగా, స్ట్రైక్ రేట్ 140.60గా ఉంది. ఈ క్రమంలో హర్మన్, మెగ్ లానింగ్ 46.62 సగటును అధిగమించింది.ఈ మ్యాచ్‌లో ఆఖరి 6 ఓవర్లలో ముంబయి ఏకంగా 91 పరుగులను చేజిక్కించుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో చివరి 6 ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా ముంబయి ఇండియన్స్ నిలిచింది.
A Master Class@imharmanpreet led from the front as she pulls off a famous win for @mipaltan 👌#MI are the first team to qualify for the #TATAWPL playoffs this season#MIvGG pic.twitter.com/NCLiIf1BgQ
— Women's Premier League (WPL) (@wplt20) March 9, 2024