T20 Rankings Released By ICC: టీ20 వరల్డ్ కప్ అనంతరం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. తాజాగా రిలీజైన ర్యాకింగ్స్‌లో అల్‌రౌండర్ కోటాలో హర్దీక్ పాండ్యా నెంబర్ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకిన పాండ్యా 222 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
అలాగే శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగా కూడా 222 రేటింగ్ పాయింట్లు ఉన్నప్పటికీ అతను సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్ థర్డ్ ప్లేస్‌లో ఉండగా, సికందర్ రజా, షకీబ్ అల్‌హసన్ తాజా అప్డేట్‌లో టాప్ 5 ఆల్ రౌండర్‌లుగా నిలిచారు.
ఇదిలా ఉంటే టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఒక దశలో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ మొదటి ఐదు స్థానాల నుంచి తొలగించబడి.. 205 రేటింగ్ పాయింట్లతో ఆరోస్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల విషయంలో ఆస్ట్రేలియా ఓపెనర్ హెడ్ మొదటి స్థానంలో నిలవగా భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో నిలిచాడు. అలాగే బౌలర్ల విభాగంలో సౌతాఫ్రికాకు చెందిన అన్రిచ్ నోర్జే మొదటి స్థానంలో ఉండగా.. భారత్ కు చెందిన అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.