NRI Strugule: అమెరికాలో జాబ్ చేసిన అనుభవం ఉన్న వ్యక్తులకు మన ఇండియాలో జాబ్ దొరకడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇక్కడి కంపెనీలు కళ్లకు అద్దుకొని ఉద్యోగం ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే, అమెరికాలో పనిచేశారంటే అత్యుత్తమైన స్కిల్స్ ఉంటాయని కంపెనీలు నమ్ముతాయి. అలాంటి వారిని కంపెనీలోకి తీసుకుంటే కొత్త విధానాలు, చిట్కాలు తెలుస్తాయని కంపెనీలు విశ్వసిస్తాయి. కొత్త ఐడియాలను కూడా అందిపుచ్చుకోవచ్చని యోచిస్తాయి.
అయితే, అమెరికాలో ఏకంగా 11 ఏళ్లపాటు వృత్తిపరమైన అనుభవం ఉన్న ఓ ఎన్నారైకి భారతదేశంలో ఎంత వెతికినా ఉద్యోగం దొరకడం (NRI Strugule) లేదు. జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఫలితం దక్కడం లేదు. వచ్చే నెలలో (అక్టోబర్) అమెరికా నుంచి బెంగళూరుకు మకాం మార్చాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు తనకు ఎదురవుతున్న పరిస్థితిని ‘రెడిట్’ వేదికగా వివరించాడు.
ఇండియాలో జాబ్ కోసం తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని, కానీ, ఒక్క ఉద్యోగం కూడా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అమెరికాలో 11 ఏళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఇక్కడ ఉద్యోగం దొరకడం లేదు’ అంటూ క్యాపన్స్ ఇచ్చి తన బాధను రాసుకొచ్చాడు.
నా తప్పు అర్థం కావడం లేదు
‘‘నేను ఏం తప్పు చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. నౌకరీ.కామ్‌లో (Naukri.com) నా ప్రొఫైల్ ఉంది. లింక్డ్‌ఇన్‌లో అయితే నేరుగా కంపెనీల ప్రతినిధులను సంప్రదిస్తున్నాను. కెరీర్‌కు సంబంధించిన ఇతర వెబ్‌సైట్లలో కూడా నా ప్రొఫైల్‌తో అప్లై చేస్తున్నాను. కొందరి ద్వారా రిఫర్ కూడా చేయించుకుంటున్నాను. అయినా ఏదీ వర్కౌట్ కావడం లేదు’’ అంటూ రెడిట్‌లో అతడు వాపోయాడు.
తాను గతంలో కన్సల్టింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీల్లో పనిచేశానని, భారత్‌లోనూ అలాంటి జాబ్స్ కోసం చూస్తున్నానని, కానీ, ఇప్పటివరకు ఒక్క జాబ్ కూడా దొరకలేదని వివరించాడు.
Read Also- Viral News:హెల్త్ బాలేక ఒక్క రోజు లీవ్ తీసుకున్న బ్యాంక్ ఉద్యోగికి హెచ్చార్ నుంచి అనూహ్య మెసేజ్
ఓపిక నశించిపోయినట్టు అనిపిస్తోందని, ఓటమిపాలైన వ్యక్తిలా భావిస్తున్నానంటూ అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను కానీ వచ్చే నెల బెంగళూరుకు వచ్చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
నెటిజన్ల సలహా ఇదే
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందించి, ఆ వ్యక్తికి కీలకమైన సూచనలు చేశారు. ‘‘మీరు భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాతే ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి. ఎందుకంటే, చాలామంది హెచ్చార్‌లు ఒక ఎన్నారైని రిక్రూట్ చేసుకోవడం రిస్క్ అని భావిస్తాయి. అందుకే ఆసక్తిని చూపించబోవు’’ అని ఓ నెటిజన్ సూచించాడు.
మరో యూజర్ స్పందిస్తూ, ‘‘మీరు ఇండియాలో లేనంత వరకు ఇక్కడి హెచ్చార్‌లు మిమ్మల్ని సీరియస్‌గా తీసుకోరు. ఎందుకంటే, చాలామంది ఇండియాకు తిరిగొస్తామని చెబుతారు. కానీ చివరికి ఇక్కడి రావడానికి భయపడిపోతారు’’ అని గ్రౌండ్ రియాలిటీని అర్థమయ్యేట్టు వివరించాడు.
మరొకరు స్పందిస్తూ. ‘‘మీరు ఫిజికల్‌గా కంపెనీ వాళ్లకు కనిపించకపోతే హెచ్చార్‌లు అసలు మిమ్మల్ని పరిగణనలోకి తీసుకోరు’’ అని పేర్కొన్నారు.
Read Also- Act Into Force: వ్యక్తిగత డేటా లీక్ చేస్తే కోట్లలో జరిమానా.. అమల్లోకి కొత్త చట్టం
మరో వ్యక్తి స్పందిస్తూ 2023లో తనకు ఎదుర్కొన్న అనుభవాన్ని పంచుకున్నాడు. ‘‘నేను కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నాను. మీరు ఇండియాలో ఉండకపోతే హెచ్చార్‌లు మిమ్మల్ని అంత సీరియస్‌గా తీసుకోరు. వారు మీపై నమ్మకాన్ని ఉంచలేరు. ఒకవేళ అమెరికాలో పరిస్థితులు ప్రతికూలంగా మారితే ఇక్కడికి రావొచ్చనే ‘బ్యాకప్ ప్లాన్’ అని హెచ్చార్ వాళ్లు భావిస్తారు’’ అని చెప్పాడు. మరో వ్యక్తి స్పందిస్తూ, ‘‘మీ రెజ్యూమ్ టాప్‌లోనే మీరు ఇండియాకు ఎప్పుడు వస్తున్నారో ఆ తేదీని క్లియర్‌గా చెప్పండి. అలాగే, ఇండియాలో ఉపయోగించే మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి’’ అని అతడు సలహా ఇచ్చాడు.