Ind vs Aus: టీమిండియా ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉంది. వైట్ బాల్ క్రికెట్ అందునా వన్డే ఫార్మాట్ లో అద్భుతమైన విజయాలతో అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ముఖ్యంగా టీమ్ కాంబినేషన్ ..భారత్ కు కుదిరినట్లుగా ఏ జట్టూ ఇంత బాగా సెట్ కాలేదు. టాపార్డర్ లో రోహిత్ (Rohith), గిల్, కోహ్లీ.. మిడిలార్డర్లో శ్రేయస్, రాహుల్, అక్షర్, పాండ్యా.. లోయర్ మిడిల్ లో జడేజా ..8వ స్థానం వరకు అద్భుతమైన బ్యాటింగ్..పాండ్యా, అక్షర్, జడేజా రూపంలో ఆల్ రౌండర్లు.. పేస్ బౌలింగ్ లో షమీ (Shami), హర్షిత్..మిస్టరీ స్పిన్నర్ వరుణ్…రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ..పోలా అదిరిపోలా అన్నట్లుగా భారత జట్టు ప్రపంచ క్రికెట్ లో మేటిజట్లకు దడ పుట్టిస్తోంది. ఆశించినట్లుగా చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో లీగ్ దశలో ఓటమన్నదే లేకుండా అగ్రస్థానంతో సెమీస్ కు దూసుకెళ్లింది.
సెమీస్ లో కఠినమైన ఆస్ట్రేలియా మన ప్రత్యర్థి గా నిలిచింది. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో కంగారూల చేతిలోనే భారత్ కంగుతిని రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత సెమీస్ లో వారిని ఓడించి రివెంజ్ తీర్చుకునే అవకాశం టీమిండియా ముందుంది. భారత (Team India) స్పిన్నర్లకు పటిష్టమైన ఆసీస్ బ్యాటింగ్ లైనప్ మధ్య జరిగే పోరులో పై చేయి ఎవరిదో మాజీ స్పిన్ దిగ్గజం అశ్విన్ (Ashwin) స్పష్టం చేశాడు. భారత్ కు ప్రమాదం ఇద్దరే.. ఒకరు హెడ్ (Head) అయితే మరొకరు మాక్స్ వెల్ (Maxwell).. అని చెబుతున్నాడు.
Also Read- Hardik Pandya: అందుకే హార్దిక్ భయ్యా.. నువ్వు కెప్టెన్ కాలేదు..!
ఇక భారత్, ఆసీస్ పోరు అంటే మనకు హెడేక్ ఒక్కడే హెడ్ కాదు.. ప్రస్తుతం మనకు ప్రమాదం మాక్స్ వెల్ అంటున్నాడు మాజీ స్పిన్నర్ అశ్విన్. ఇటీవలి కాలంలో అంతగా ఫాంలో లేకున్నా భారత్ తో సెమీస్ పోరంటే అతనిలోని నిజమైన బ్యాటర్ కనిపిస్తాడని.. అతన్ని ఆపే సత్తా ..అతన్ని ఔట్ చేసే సామర్థ్యం రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అని అంటున్నాడు. గతంలో కుల్దీప్ యాదవ్ ..మాక్స్ వెల్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. భారత్ తో ఆడిన సమయంలో కుల్దీప్ బౌలింగ్ ఎదుర్కొనే విషయంలో అతని తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. వన్డేల్లో మూడుసార్లు కుల్దీప్ (Kuldeep) చేతిలో ఔటైన మాక్స్ వెల్ సగటు 33 గా ఉంది. ఇక టెస్టుల్లో, టీ20ల్లో ఒక్కోసారి కుల్దీప్ అతన్ని ఔట్ చేయగా.. ఐపీఎల్ లో 4సార్లు అతన్ని పెవిలియన్ పంపాడు.
ఇక హెడ్ ను త్వరగా ఔట్ చేయాలంటే పది ఓవర్ల వరకు పేస్ ను ప్రయోగించి లాభం లేదంటున్నాడు. తాను కెప్టెన్ అయితే ప్రారంభ ఓవర్లలోనే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravathy)ని బౌలింగ్ కు దింపి హెడ్ ను ఔట్ చేయిస్తానని అశ్విన్ చెప్పాడు.మన స్పిన్నర్లను ఎదుర్కోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ జట్టుకైనా అసాధ్యమని అశ్విన్ తేల్చి చెబుతున్నాడు.
మంగళవారం జరిగే మౌత్ వాటరింగ్ పోరులో గెలిచి ఫైనల్ చేరుకోవాలని భారత్ (Team India), ఆసీస్ (Ausis) జట్లు భావిస్తుండగా.. ప్రపంచ క్రికెట్ లో పటిష్ఠమైన రెండు జట్ల మధ్య జరిగే పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
MK Stalin: ‘అత్యవసరంగా పిల్లల్ని కనండి’.. ప్రజలకు సీఎం పిలుపు