pandya
స్పోర్ట్స్

Hardik Pandya: అందుకే హార్దిక్ భయ్యా.. నువ్వు కెప్టెన్ కాలేదు..!

Hardik Pandya: టీమిండియాను లీడ్ చేయాలంటే అదుండాల్సిందే. అంటే లౌక్యం.. అందుకే ధోనీ (Dhoni) మిస్టర్ కూల్ కెప్టెన్ ..రోహిత్ అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నాడు. రోహిత్ (Rohit) అందరితో కలుపుగోలుగా ఉంటాడు. ఎవరైనా ప్లేయర్ కు ఇబ్బంది ఉంటే వెళ్లి మాట్లాడుతాడు. సలహాలు ఇస్తాడు. సరి చేస్తాడు. వారికి కావలసిన ఆత్మవిశ్వాసం కల్పిస్తాడు. కానీ..కెప్టెన్ మెటీరియల్ అనుకున్న హార్దిక్ పాండ్యా మాత్రం అన్నింటికీ విరుద్ధం.. అతని ఆటిట్యూడ్ డ్రెసింగ్ రూమ్ వాతావరణాన్ని పాడు చేసేలా.. పరస్పర నమ్మకం సడలిపోయేట్లుగా ఉంటుంది.. అంతేకాదు ఆటగాళ్లు వ్యక్తిగత మైలు రాళ్లు అందుకోకుండా అడ్డుపడే అవలక్షణం అతనంటే అందరికీ అదోరకం ఏవగింపునే కలిగిస్తోంది. మ్యాచ్ ఫినిషర్ పాత్రలో అతను ఎక్కువగా చివరలో బ్యాటింగ్ చేస్తుంటాడు. అప్పటికే క్రీజులో పాతుకపోయి.. పరుగులు చేస్తూ ఏ హాఫ్ సెంచరీనో.. లేదంటే సెంచరీకి చేరువగా ఉంటే అవతలి ఎండ్ లో ఖర్మకాలి హార్దిక్ ఉంటే అంతే.. వారికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించేస్తాడు. ఎందుకు ఇలా అంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం ..ప్లేయర్ల వ్యక్తిగత మైలురాళ్లు నాకు ముఖ్యం కాదంటూ పేద్ద డైలాగులు పలుకుతుండడం పాండ్యా (Pandya) హెడ్ వెయిట్ ను సూచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

తాజాగా పాకిస్థాన్ తో మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ ముంగిట ఉండగా.. బ్యాటింగ్ వచ్చిన పాండ్యా తొలి బంతినే బౌండరీకి తరలించాడు. దీంతో కోహ్లీ సెంచరీకి అడ్డం పడేందుకే పాండ్యా వచ్చాడని అనుకున్నారు. అతను ఔట్ కావడం.. అక్షర్ పటేల్ ..కోహ్లీ సెంచరీకి సహకారం అందించడం చూశాం. మరి పాండ్యా కే జట్టు ప్రయోజనాలు పడుతాయి.. అక్షర్ కు పట్టవా..? ఇదేం మాయరోగం.. జట్టు విజయాలతో పాటు ప్లేయర్ల రికార్డులూ ముఖ్యమే .. రికార్డుల కోసం ఆడకూడదు కానీ.. ప్లేయర్లు రికార్డులు కొట్టకుండా అడ్డుకోవద్దు కదా.. ఇలాంటి అవలక్షణాలు అనేకం ..

అంతేకాదు గతంలో వెస్టిండీస్‌తో 2023లో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 17.5 ఓవర్లలోనే పూర్తి చేసింది. తిలక్ వర్మ 49 నాటౌట్ ఉన్నాడు.  ఇంకా 2.1 ఓవర్లు మిగులున్నాయి అయినా పాండ్యా ఆగకుండా తిలక్ వర్మను హాఫ్ సెంచరీ చేయనీయకుండా సిక్సర్ బాది మ్యాచ్‌ని ముగించాడు. ఇదేనా ఒక యంగ్ స్టర్ పట్ల నువ్వు చూపించేది..? తోటి ఆటగాడి వ్యక్తిగత మైలురాళ్లకు అడ్డం పడడమేనా నీ క్రీడా స్ఫూర్తి అంటూ నెటిజన్లు పాండ్యాను ఓ రేంజిలో ఆటాడుకున్నారు. ఇలా ఉంటే డ్రెసింగ్ రూంలో వాతావరణం ఫ్రెండ్లీగా ఉంటుందా..? పాకిస్థాన్ జట్టు మాదిరే టీమిండియా కూడా తయారౌతుంది. అందుకే వైట్ బాల్ క్రికెట్ లో అతను కెప్టెన్ గా ఫస్ట్ చాయిస్ అయినా చాన్స్ పోగొట్టుకున్నాడు. కెప్టెన్ ఎంపిక కోసం చీఫ్ సెలక్టర్ అగార్కర్ ప్లేయర్ల అభిప్రాయాలు తీసుకుంటే ..దిమ్మతిరిగే ఫలితం వచ్చిందట.. కెప్టెన్ గా ఎవరైనా ఓకే.. కానీ పాండ్యా మాత్రం వద్దన్నారట.. అందుకే టీ20 కెప్టెన్ గా సూర్య .. వన్డేల్లో వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను ఎంపిక చేసారు.

గతంలో ప్లే బోయ్ లాంటి రవిశాస్ర్త్రి భారత జట్టును విజయవంతంగా నడిపించగా.. అనిల్ కుంబ్లే ఆటగాళ్ల వ్యతిరేకతతో మధ్యలోనే తప్పుకున్నాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛనివ్వాలి. అంతేకాని హెడ్ మాస్టర్ మాదిరిగా బెత్తం పట్టుకుంటాను.. అంటే కుదరదు. తాజాగా పాండ్యా హెడ్ వెయిట్ .. అతని ఆటిట్యూడ్ కెప్టెన్ పదవికి అడ్డం పడ్డాయి. నిజమే కదా..

Read Also: Ind vs Pak: రోహిత్‌ శర్మ వరల్డ్‌ రికార్డు.. 9 వేల పరుగులు పూర్తి

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్