Chhaava Telugu Trailer: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రం బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. హిట్స్‌లేక అల్లాడిపోతున్న బాలీవుడ్‌కు ఈ సినిమా ఊపిరిపోసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. థియేటర్లలో సినిమా చూస్తున్నవారంతా ఎమోషనల్ అవుతున్నారంటే, ఎంత గొప్పగా లక్ష్మణ్ ఈ సినిమాను తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ, మార్చి 7న ఈ సినిమా తెలుగు అనువాదం గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ మొదలయ్యాయి. అందులో భాగంగా మేకర్స్ ‘ఛావా’ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఒక్కటి చాలు, సినిమా ఎందుకు చూడాలో అని చెప్పడానికి అన్నట్లుగా ఒక్కో సన్నివేశాన్ని దర్శకుడు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
Also Read- Meenakshi Chaudhary: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి.. అంతా ఫేక్! చర్యలు తప్పవ్
ముందుగా ఈ ట్రైలర్‌లో ఉన్న డైలాగ్స్ గమనిస్తే:
* ‘ఛత్రపతి శివాజీ జన్నత్ చేరుకున్నారు జనా..’
* ‘ఆ దక్కన్‌ని మన మొగలాయిలు దక్కించుకోవడం ఎంతో దూరం లేదు’
* ‘మరాఠాల సింహం లేనప్పటికీ, తన వేటని ఈ ఛావా కొనసాగిస్తాడు’
* ‘మరాఠా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎవడు ఆలోచించినా చీల్చి చెండాడుతాను’
* ‘గర్జనకు లొంగకపోతే పంజా వేట తప్పదు’
* ‘ఈ యుద్ధం స్వరాజ్య సాధన కోసం చేసే యజ్ఞం. ఆ మహాదేవుని సాక్షిగా ప్రతి పౌరుడి సంరక్షణే మన లక్ష్యం. స్వరాజ్య స్థాపన సాక్షాత్ ఈశ్వరేత్యా!’
* ‘మేము ఔరంగజేబును కలవడానికి వెళుతున్నాం. కళ్లలో కించిత్ చింత కూడా లేదు’
* ‘భోంస్లే వంశంలోని ప్రతి మగవారు ప్రళయంతో సమానం. పర్వతాలే అడ్డుకోలేని ధాటిని కంకరరాళ్లు ఏం చేస్తాయ్’
* ‘చిన్నా పెద్దా అని చూడకుండా అయినవాళ్ల శవాలను తొక్కుకుంటూ ఈ కిరీటాన్ని అందుకున్నాను. మేము మళ్లీ కిరీటాన్ని ఆ పొగరుబోతు శంభా చావు కేకని హిందూస్థాన్ మొత్తం విన్నాకే ధరిస్తాను. కాషాయం రంగు ఎక్కడ కనిపించినా సరే.. ఎర్రగా మార్చు’
* ‘సమయం ఆసన్నమైంది.. మెరుపుదాడి చేద్దాం. ఔరంగు నిరంకుశత్వాన్ని కాల్చి బూడిద చేద్దాం. ప్రత్యర్థులు ఎన్ని పన్నాగాలు పన్నినా సరే, ప్రతి వ్యూహాన్ని చేదిద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వప్నాన్ని సాకారం చేసి తీరుతాం. జై భవాని. నమ: పార్వతీ పతయే హర హర మహాదేవ్’
* ‘సమగ్ర మరాఠా సామ్రాజ్యంతో పాటు నేను కూడా ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే’
* మీ నమ్మకం మాకు తోడుంటే, యుద్ధం కూడా అవసరం లేదు’
* ‘వీడ్ని ఎలా హింసించాలంటే, చావు కూడా వీడ్ని జాలి పడి చంపాలి’
* ‘ఆ చావు నా కాలి గజ్జకి కట్టి యుద్ధతాండవం చేస్తాను. నా చావు ప్రతి మరాఠా ఇంట్లో ఒక శివాజీని, శంభాజీని పుట్టిస్తోంది. కానీ నీ చావు మొగల్ సామ్రాజ్య పతనానికి పునాది’.
ఇవి ఈ ట్రైలర్‌లోని డైలాగ్స్. ఈ డైలాగ్స్ వింటూ, అత్యద్భుతమైన విజువల్స్ చూస్తుంటే ట్రైలర్‌కే టికెట్ డబ్బులు పెట్టొచ్చు అన్నంత గొప్పగా ఉంది. సాంకేతికంగా ఈ సినిమా ఏ రేంజ్‌లో తెరకెక్కిందనేదానికి ఈ ఒక్క ట్రైలర్ చాలు. కచ్చితంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని, బ్రహ్మాండమైన హిట్ ఇక్కడ కూడా అందుకుంటుందని ఈ ట్రైలర్ చూసిన ఎవరైనా చెబుతారు. ప్రధాన పాత్రధారులందరూ ఈ సినిమా కోసం ఎంతగా లీనమయ్యారో. ముఖ్యంగా విక్కీ కౌశల్ నటనకు మార్చి 7న తెలుగు రాష్ట్రాల థియేటర్లు ఈలలు, కేకలతో మోత మోగిపోవడం పక్కా అని చెప్పొచ్చు. మరి సింగిల్ లాంగ్వేజ్‌లో విడుదలై దాదాపు రూ. 500 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
MAD Square vs Robinhood: ‘రాబిన్‌హుడ్’ రిలీజ్ రోజే ‘మ్యాడ్ స్క్వేర్’.. నిజంగా అమావాస్యే కారణమా?
Vidya Balan: ఆ వీడియోలు నావి కావు.. డీప్ ఫేక్ బారిన విద్యాబాలన్