Meenakshi Chaudhary
ఎంటర్‌టైన్మెంట్

Meenakshi Chaudhary: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి.. అంతా ఫేక్! చర్యలు తప్పవ్

Meenakshi Chaudhary: ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌‌గా టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి‌ని ఏపీ ప్రభుత్వం నియమించిందని ప్రచారం జరిగింది. అయితే, ఇందులో ఏమాత్రం నిజం లేదని, అంతా తప్పుడు ప్రచారమని, ఇలా ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామనేలా ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ వింగ్ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇలా వరుస విజయాలలో ఆమె హీరోయిన్‌గా టాప్ ఛైర్ సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇలా విజయవంతంగా కెరీర్‌ని కొనసాగిస్తున్న మీనాక్షికి ఏపీ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చిందంటూ ఆదివారం అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో హడావుడి నడిచింది. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందనేది కూడా తెలుసుకోకుండా అంతా ఈ వార్తలను హైలెట్ చేశారు.

Also Read- Sandeep Reddy Vanga: ఐఏఎస్ అవ్వడం ఈజీ.. డైరెక్టర్ కావడం నాట్ ఈజీ

అసలేం జరిగిందంటే..?
‘మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారిత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు, ఈ బ్యూటీకి బంపర్ ఆఫర్ వరించింది’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని, ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ వింగ్ సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో మీనాక్షి చౌదరిపై వస్తున్న వార్తలకు బ్రేక్ పడినట్లయింది.

ఎందుకిలా..?
అంతకు ముందు, ఈ బ్యూటీకి అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ, సోషల్ మీడియాలో ఆమె పేరు ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చేశారు. ఆమె అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నట్లుగా స్పందించారు. కానీ అసలు విషయం తెలిసి అంతా అవాక్కవుతున్నారు. మరోవైపు, ఎందుకిలా వార్తలు పుట్టుకొచ్చాయి? ఎవరు ఇదంతా చేశారనేదానిపై ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు సైతం సీరియస్‌గా ఉన్నారని తెలుస్తున్నది. ఇకపై సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ వార్తలు సృష్టించే వారిపై కఠినంగా చర్యలుంటాయని ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా హెచ్చరించారు.

బిజీ హీరోయిన్
మీనాక్షి చౌదరి విషయానికి వస్తే, ప్రస్తుతం వరుస చిత్రాలలో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోలు ఆమెనే హీరోయిన్‌గా కావాలని కోరుకుంటున్నారు. కారణం ఆమె సక్సెస్ గ్రాఫ్ అలా ఉంది. రీసెంట్‌గా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఆమె రూ. 300 కోట్ల క్లబ్‌లోకి సైతం చేరింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ వంటి చిత్రాలతో పాటు మరో అరడజనుకు పైగా చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి:
Priya Kommineni: ఈ ఖమ్మం చిన్నదాని కోరిక ఏంటంటే?

Sankranthiki Vasthunam OTT: ఓటీటీలో ఇలా చేశారేంటి? నిరాశలో ఫ్యాన్స్!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం