Priya Kommineni: సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మహా సముద్రం వంటిది. ఇక్కడ టాలెంట్ ఉన్నవాళ్లకు ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది. చిన్న, పెద్ద అనే తేడాలు లేకుండా సినిమా ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుంది. ఇప్పటికే ఎంతో మంది తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. రోజూ సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రం కొంతకాలం ఇక్కడే తమ సత్తా చాటుతారు. టాలెంట్ లేని వారు, తమకు ఎవరూ సపోర్ట్ చేయలేదంటూ నిందలు వేస్తుంటారు. అన్నింటినీ సినిమా ఇండస్ట్రీ భరిస్తూనే ఉంటుంది. అయినా వచ్చేవాళ్లకి స్వాగతం పలుకుతూనే ఉంటుంది. ఇండస్ట్రీ వదిలిపోయే వారికి వీడ్కోలు పలుకుతూనే ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో చిన్న స్థానం కోరుకుంటుంది ఖమ్మం చిన్నది ప్రియ కొమ్మినేని. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Senior Heroine: సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నాకంటూ చిన్న స్థానం ఏర్పరచుకోవాలన్నది నా పెద్ద కోరిక అని చెప్పుకొచ్చింది ‘తకిట తదిమి తందాన’ చిత్రంతో అరంగేట్రం చేసిన ప్రియ కొమ్మినేని. ఆమె మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో పిచ్చి. స్కూల్, కాలేజ్‌లలో కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో యమా యాక్టివ్‌గా పాల్గొనేదాన్ని. ‘తకిట తదిమి తందాన’ వంటి ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమాతో సినీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చిందీ అచ్చ తెలుగమ్మాయి. అందానికి అందం, దానికి తగిన అణకువ, నటనకు నటన అన్నీ కలగలిపిన ఈ బుట్టబొమ్మ గట్టిగా ట్రై చేస్తే టాప్ హీరోయిన్ అయ్యే లక్షణాలున్నాయనేలా మొదటి సినిమాతోనే ప్రేక్షకులతో అనిపించుకుంటోంది.

ఇంజినీరింగ్ చేసి, కొన్నాళ్ళపాటు ఉద్యోగం చేస్తూనే, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్న ఈ భామకు ‘తకిట తదిమి తందాన’తో అవకాశం వరించింది. ఈ సినిమా చూసిన వాళ్ళంతా, హీరోయిన్‌గా మంచి భవిష్యత్ ప్రియకు ఉందని ప్రశంసలు కురిపిస్తుండడంతో, పూర్తి స్థాయిలో కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిపోయిందట. ‘తకిట తదిమి తందాన’ సినిమాలో అవకాశం ఇచ్చి, ప్రోత్సహించిన నిర్మాత చందన్, దర్శకుడు రాజ్ లోహిత్‌లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్న ప్రియ, ఈ చిత్రానికి వస్తున్న స్పందనతో చాలా హ్యాపీగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఫిబ్రవరి 27న ‘తకిట తదిమి తందాన’ చిత్రం థియేటర్లలో విడుదలైంది.