T20 World Cup Schedule: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
T20-World-cup-Schedule (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

T20 World Cup Schedule: భారత్-పాకిస్థాన్ మధ్య మరో మ్యాచ్.. తేదీ ఖరారు.. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

T20 World Cup Schedule: వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యంలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌-2026 షెడ్యూల్ (T20 World Cup Schedule) ఇవాళ (మంగళవారం) విడుదలైంది. దాయాది దేశాలైన భారత్ – పాకిస్థాన్ (India Vs Pakistan)మధ్య ఫిబ్రవరి 15న లీగ్ దశ మ్యాచ్ జరగనుంది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయిన నేపథ్యంలో, ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు శ్రీలంక రాజధాని రాజధాని కొలంబోలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధికారిక షెడ్యూల్ విడుదల చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్, అలాగే ఆతిథ్య దేశమైన భారత్, దాయాది దేశం పాకిస్థాన్‌ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఫిబ్రవరి 15న కొలంబోలని ఆర్ ప్రేమదాస్ స్టేడియం వేదికగా, భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

ఫిబ్రవరి 7న టోర్నీ ప్రారంభం

ఇక, ఫిబ్రవరి 7న జరిగితే తొలి మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్ 2026 షురూ కానుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరుగుతుంది. తుది పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఒకవేళ పాకిస్థాన్ కనుక ఫైనల్ చేరుకుంటే, కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఇక, రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒకటి కోల్‌కతా, రెండవది ముంబై వేదికగా జరగనున్నాయి. కాగా, దాదాపు 10 ఏళ్ల తర్వాత తిరిగి భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. చివరిసారిగా 2016లో భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ కప్‌లో భారత్ సెమీఫైనల్ వరకు వెళ్లింది. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో మట్టికరిచింది.

20 జట్లు.. 4 గ్రూపులు

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు ఆడబోతున్నాయి. 5 జట్ల చొప్పున నాలుగు గ్రూపులో విభజించారు. గ్రూప్-1లో ఇండియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా ఉన్నాయి. ఇక, గ్రూప్-2లో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమాన్, ఐర్లాండ్ ఉన్నాయి. గ్రూప్ 3లో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ ఉన్నాయి. గ్రూప్ 4లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కెనడా జట్లు ఉన్నాయి.

Read Also- iBomma Ravi Case: ఐబొమ్మ ఎలా పనిచేస్తుందో.. కళ్లకు కట్టిన ఏసీపీ.. వెలుగులోకి మరిన్ని నిజాలు

ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

భారత్ ఉన్న గ్రూపులో పాకిస్థాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న అమెరికాతో ఆడనుంది.

భారత్ వర్సెస్ అమెరికా – ఫిబ్రవరి 7, 2026 (ముంబై)
భారత్ వర్సెస్ నమీబియా – ఫిబ్రవరి 12 (ఢిల్లీ)
భారత్ వర్సెస్ పాకిస్థాన్ – ఫిబ్రవరి 15 (కొలంబో)
భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ – ఫిబ్రవరి 18 (అహ్మదాబాద్).

తొలిసారి ఇటలీ అరంగేట్రం

టీ20 ప్రపంచ కప్ 2026తో ఇటలీ తొలిసారి ఐసీసీ వరల్డ్ కప్‌లో ఆడబోతోంది. ఇటలీ ఫుట్‌బాల్ ఏకంగా 4 సార్లు ఫిఫా వరల్డ్ కప్‌లు గెలుచుకుంది. కానీ, మొట్టమొదటిసారి ఆ దేశం ఒక క్రికెట్ వరల్డ్ కప్ ఆడబోతోంది. ఇటలీ జట్టు ఉన్న గ్రూపులో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు ఉన్నాయి.

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!