IND vs SA 2025 3rd ODI: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా (India Vs South Africa) మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, రాంచీలో తొలి వన్డే, ఆ తర్వాత రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో భారీగా పరుగులు సమర్పించుకున్న టీమిండియా బౌలర్లు, చివరిదైన వైజాగ్ వన్డేలో ((IND vs SA 2025 3rd ODI)) కాస్త ఫర్వాలేదనిపించారు. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చెలరేగడంతో పర్యాటక సఫారీ జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో, టీమిండియా విజయలక్ష్యం 271 పరుగులు ఖరారైంది. సహచర ఆటగాళ్లు ఎవరూ భారీ స్కోర్లు సాధించలేకపోయినప్పటికీ, దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు. 89 బంతులు ఎదుర్కొని 106 పరుగులు బాదాడు. ఇందులో 6 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్లలో రియాన్ రికెల్టన్ 0, తెంబా బవూమా 48, మ్యాథ్యూ బ్రీజ్కీ 24, ఐడెన్ మార్క్రమ్ 1, డెవాల్డ్ బ్రెవీస్ 29, మార్కో యన్సెస్ 17, కోర్బిన్ బాష్ 9, కేశవ్ మహారాజ్ 20 (నాటౌట్), లుంగి ఎంగిడి 1, బార్ట్‌మాన్ 3 చొప్పున పరుగులు చేశారు.
రాణించిన కుల్దీప్ యాదవ్
భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. ఇక, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 4, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు 12 ఎక్స్‌ట్రాలు ఇచ్చారు. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, పేసర్ అర్షదీప్ సింగ్ టీమిండియాకు చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే రియాన్ రికెల్టన్ వికెట్ తీశాడు. ఆ తర్వాత కెప్టెన్ తెంబా బవూమా-క్వింటన్ డికాక్ ఇద్దరూ కలిసి రెండవ వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి, ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, కెప్టెన్ కేఎల్ రాహుల్ చక్కటి ఫామ్‌లో ఉండడంతో ఈ టార్గెట్‌ను సాధించడం ఏమంత కష్టం కాకపోవచ్చనే అంచనాలున్నాయి. ‘ఛేజింగ్ కింగ్’గా పేరున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగితే భారత విజయానికి ఢోకా ఉండకపోవచ్చు. అలాగే, యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ గత మ్యాచ్‌లో సెంచరీ సాధించడంతో అతడు కూడా ఈ మ్యాచ్‌లోనూ రాణించే అవకాశం లేకపోలేదు.
Make that FOUR for Kuldeep Yadav 😎
South Africa 258/9 in the 46th over
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank https://t.co/wx48vO7ai2 pic.twitter.com/kigwU7mXyu
— BCCI (@BCCI) December 6, 2025

