Suryakumar Yadav: పలకరించుకోని భారత్, పాక్ కెప్టెన్లు
Asia-Cup-2025
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Suryakumar Yadav: ప్రెస్‌‌మీట్‌లో పాక్ కెప్టెన్ మినహా అందరికీ షేక్‌హ్యాండ్ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్-2025 ఇవాళ్టి (సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభమవుతోంది. టోర్నీ షురూ కావడానికి ముందు అన్ని జట్ల కెప్టెన్ జాయింట్ ప్రెస్‌మీట్ మంగళవారం జరిగింది. భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంగ్‌కాంగ్, యూఏఈ, ఒమన్ జట్ల కెప్టెన్లు ఈ మీడియా సమావేశంలో  పాల్గొన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరుదేశాల కెప్టెన్లపైనే మీడియా ప్రతినిధులు ఎక్కువగా దృష్టిసారించారు.

నో షేక్ హ్యాండ్, నో హగ్స్..

జాయింట్ ప్రెస్‌మీట్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav).. ఒక్క పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాను మినహా ప్రతీ జట్టు కెప్టెన్‌ను విష్ చేశాడు. అన్ని జట్ల కెప్టెన్లకు షేక్ హ్యాండ్‌తో పాటు స్నేహపూర్వకంగా ఆలింగనం కూడా చేసుకున్నాడు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే పాక్ కెప్టెన్ సల్మాన్ ఎవర్నీ విష్ చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భారత్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాత్రం అందరినీ చిరునవ్వుతో పలకరించాడు. మీడియా సమావేశంలోనే వాతావరణం ఇంత వేడివేడిగా ఉంటే, ఇక మైదానంలో భారత్, పాక్ ఆటగాళ్లు ఇంకెంత దూకుడుగా తలపడతారో అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి.

Read Also- Bhatti Vikramarka: మధిర నియోజకవర్గంలో రూ.45 లక్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన.. డిప్యూటీ సీఎం

పాక్‌తో మ్యాచ్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

మీడియా ప్రతినిధులు ఎక్కువగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించే ఎక్కువగా ప్రశ్నలు అడిగారు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కలహాలు (అగ్రెషన్) జరగకుండా ఎలా నియంత్రించుకుంటారని మీడియా ప్రశ్నించగా, సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. అగ్రెషన్‌ను ఎలా నియంత్రిస్తారు? అని ప్రశ్నించాడు. గ్రౌండ్‌లో దూకుడు కచ్చితంగా ఉంటుందని, దూకుడు లేకుంటే గెలవలేం కూడా అని అన్నారు. దూకుడు కూడా ఆటలో భాగమేనని సూర్యకుమార్ చెప్పాడు. టోర్నీకి ప్రిపరేషన్ విషయానికి వస్తే చక్కగా ప్రాక్టీస్ చేశామని, వాతావరణం కూడా మంచిగా ఉందని చెప్పాడు. టోర్నీ మొదలుకావడానికి ముందు జట్టు మానసికంగా చాలా దృఢంగా ఉందని సూర్యకుమార్ తెలిపాడు. ‘‘కొన్ని సెషన్లలో మంచిగా ప్రాక్టీస్ చేశాం. టీమ్‌కు మంచి ఫీలింగ్ ఉంది. ఆసియా కప్‌లోని ఉత్తమ జట్లను ఎదుర్కొనడం ఒక మంచి మ్యాచ్ అవుతుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డాడు.

Read Also- Charlapalli Drug Case: చర్లపల్లి డ్రగ్​ కేసులో.. అండర్​ వరల్డ్​ లింకులు.. సంచలన నిజాలు వెలుగులోకి?

పాక్ కెప్టెన్ ఏమన్నాడంటే

అదే ప్రశ్నకు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా స్పందిస్తూ చాడు. ఎవరైనా ఆగ్రహంతో ఆడాలనుకుంటే, అది వారి వ్యక్తిగత నిర్ణయం అని చెప్పాడు. అగ్రెషన్ విషయంలో ఆటగాళ్లు ఎవరికీ తాను ప్రత్యేక ఆదేశాలు ఇవ్వబోనని సల్మాన్ చెప్పాడు. కాగా, ఆసియా కప్ 2025లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను బుధవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో (యూఏఈ) ఆడనుంది. ఆదివారం పాకిస్థాన్‌తో హై వోల్టేజీ పోరు జరగనుంది.

Read Also- Crime News: తమిళనాడులో ఊహించని షాక్.. బంగారం దొంగిలించిన సర్పంచ్.. ఎంతంటే..?

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు