Abhishek Sharma: ఐపీఎల్ 2025లో బ్రేక్అవుట్ స్టార్లలో ఒకరైన అభిషేక్ శర్మ ( Abhishek Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇప్పటికే ఇతని మీద ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే, తాజాగా ఫ్యాషన్ ఫౌండర్ తో ప్రేమలో ఉన్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పంజాబ్ కింగ్స్‌పై అభిషేక్ 141 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వారి ఎఫైర్ ఇంకా బయటపడనప్పటికీ లైలా తీరు చూస్తుంటే, ఇదే నిజమే అన్నట్టు అందరూ అనుకున్న ఊహాగానాలకు ఆజ్యం పోశాయి.
Also Read: MP Chamala Kiran: కేటీఆర్ చెప్పిన డెడ్ లైన్ దాటిపోయింది.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
లైలా ఫైసల్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్, లైలా రూహి ఫైసల్ డిజైన్స్ కి ఆమె ఫౌండర్. ఈమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 28,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. లైలా సోషల్ మీడియాలో ఫ్యాషన్ చిట్కాలు, లైఫ్ స్టైల్ గురించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.
లైలా ఫైసల్ ( Laila faisal ) , అభిషేక్ శర్మ ( Abhishek Sharma) ఎన్నో పార్టీలలో కలిసి కనిపించారు. ప్రస్తుతం, సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది. ఫ్యాషన్ రంగంలో లైలా తన బ్రాండ్‌ను మొదటి నుండి విజయవంతంగా నిర్మిచుకుంది. వ్యాపార విషయాల్లో ఆమె చాలా చురుకుగా ఉంటుంది.ఈ పోటీ ప్రపంచంలో లైలా స్థానం ఎప్పటికి ప్రత్యేకంగా ఉంటుంది.
Also Read: Deccan Cement: డెక్కన్ సిమెంట్ కబ్జా గుర్తుందా? బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్, పర్యావరణవేత్తల ప్రశ్నలు
లైలా ఫ్యాషన్ సెన్స్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వర్గాలలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అభిషేక్, లైలా న్యూఢిల్లీలోని హై-ప్రొఫైల్ ఈవెంట్‌లలో ఇద్దరూ మెరిశారు. వారు బహిరంగంగా కలుస్తుండటంతో వారిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనే అనుకుంటున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు