తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: MP Chamala Kiran: ప్రభుత్వంపై బాంబ్ పేల్చుతానని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన డెడ్ లైన్ దాటిపోయిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. కేటీఆర్ కొండంత రాగం తీసి పాట కూడా పాడలేదని విమర్శించారు. హైడ్రోజన్ బాంబు అని చెప్పి, కనీసం ఉల్లిగడ్డ బాంబు కూడా పేల్చలేదని చురకలు అంటించారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ ప్రభుత్వం మీద కేటీఆర్ బురద చల్లుతున్నారన్నారు.
ఆయన మాట్లాడే మాటలకు అర్ధం లేదన్నారు. గ్రౌండ్ వర్క్ లేకుండా కేటీఆర్ మాట్లాడం విచిత్రంగా ఉన్నదన్నారు. ఐసీఐసీఐ నుంచి రుణం తీసుకున్నామని కేటీఆర్ చెప్తున్న దానిలో నిజం లేదన్నారు. కేవలం బాండ్ల ద్వారా వచ్చిన డబ్బులను మాత్రమే తీసుకున్నామన్నారు. కేటీఆర్ మాట్లాడే మాటలకు అర్ధం పర్ధం లేదన్నారు. హెచ్ సీయూ భూముల విలువ రూ.5200 కోట్లు అని కేటీఆర్ చెప్పగా, ఆయన శిష్యుడు ఏకంగా రూ.20 వేల కోట్లు తీసుకున్నారని చెప్పడం విచిత్రంగా ఉన్నదన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్నారు. హైదరాబాద్ లో జూ లు ఉంటాయని, అటవీ ఉన్నదంటే ఎవరు నమ్ముతారు? అంటూ ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేస్తే బీఆర్ ఎస్ కు నచ్చడం లేదన్నారు. ప్రభుత్వం ప్రారంభిస్తున్న పథకాలను అడ్డుకునేందుకు కుట్ర పడుతున్నారన్నారు. సన్న బియ్యం మంచి పథకం అని ప్రజలకు సంపూర్ణంగా ఉపయోడపతుందన్నారు.
Also Read: Formula e Race Case: జైలుకు వెళ్లనున్న కేటీఆర్?.. పీసీసీ చీఫ్ సంచలన కామెంట్స్!