Miss World Contest 2025: మిస్ వరల్డ్ ఉత్సవం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందని తెలంగాణ పర్యాటక కార్యదర్శి స్మితా సభర్వాల్ అన్నారు. రాష్ట్ర శక్తివంతమైన సంస్కృతి, వంటకాలు, చారిత్రక మైలురాళ్లను ప్రోత్సహించడానికి ఒక వేదికను అందిస్తుందని భావిస్తున్నామన్నారు. మిస్ వరల్డ్ హెరిటేజ్ టూర్ పర్యవేక్షణలపై పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షనిర్వహించారు.
తెలంగాణ పర్యాటక రంగం మిస్ వరల్డ్ పోటీదారులకు కాకతీయ వైభవం, రామప్ప ఆలయాన్ని ప్రదర్శించడానికి వేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మే 14న వరంగల్ కు పోటీదారులు వెళ్లనున్నట్లు తెలిపారు. తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం,ప్రపంచ స్థాయి ఆతిథ్యాన్ని ప్రపంచ ప్రేక్షకులకు ప్రదర్శించడానికి ఏర్పాట్లు పై దృష్టిసారించాలన్నారు. తెలంగాణను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా ప్రదర్శించడం, సంప్రదాయాన్ని చాటేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పోటీలో పాల్గొనేవారు, సందర్శకులకు చిరస్మరణీయమైన అనుభవాన్ని అందించడానికి పర్యాటక శాఖ అధికారులు పనిచేయాలని సూచించారు.
Also read: Renu Desai: నా రెండో పెళ్లే మీకు ముఖ్యం.. అంతేనా!
ఇది తెలంగాణ ప్రపంచ పర్యాటక ఆకర్షణను మరింత పెంచుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండీ ప్రకాష్ రెడ్డి, సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ అలేఖ్య పుంజ్యాల, సాంస్కృతిక డైరెక్టర్ ఎం హరికృష్ణ, హన్మకొండ కలెక్టర్ ప్రవీణ్య, ములుగు కలెక్టర్ దివాకర్, ములుగు ఎస్పీ శబరీష్ , యువజన సేవల డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు, మిస్ వరల్డ్ ప్రతినిధులు , ఈవెంట్ మేనేజర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.